- రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.
గన్నేరువరం
(నేటి సత్యం) డిసెంబర్ 13 :కరీంనగర్ జిల్లా:గన్నేరువరం మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలోని గ్రామపంచాయతీలు 17 సర్పంచ్ స్థానాలు ఉండగా ఇందులో రెండు ఏకగ్రీవం కాగా మిగతా 15 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మండలంలో మొత్తం సర్పంచ్ అభ్యర్థులు(56) ఇందులో 02 ఏకగ్రీవం.54 అభ్యర్థులు బరిలో ఉన్నారు.
వార్డు అభ్యర్థులు(241) ఉండగా(43) స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.(198) అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ విడుదలో ఎన్నికలకు సంబంధించి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను ఇతర సామాగ్రిని సిబ్బంది పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు శనివారం తరలించారు. ఇందులో భాగంగా దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్ లను అందుబాటులో ఉంచారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్వో కనకయ్య, ఎంఈఓ రామయ్య, ఎంపీ ఓ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి పోలీసు అధికారులు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు విధులు సక్రమంగా నిర్వహించాలని, అడిషనల్ డీసీపీ వెంకటరమణ
పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేసారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీస్ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలని, అడిషనల్ డీసీపీ అడ్మిన్ వెంకటరమణ సూచించారు. శనివారం ఎస్సై జి నరేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి యాదగిరి తో కలిసి పోలీసులకు విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ నుండి శాంతిభద్రతల పరిరక్షణ సక్రమంగా జరగాలని సూచించారు.