Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 8:35 am Editor : Admin

సిఆర్ పాలి క్లినిక్. ఉచిత మేఘ వైద్య శిబిరం!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సి ఆర్ పాలిక్లినిక్ , డయాగ్నస్టిక్ కేంద్రం మరియు హైదరాబాద్ మేవరిక్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యములో ఉచిత మెగా వైద్య శిబిరం :
శేర్లింగంపల్లి శేరిలింగంపల్లి డిసెంబర్ 14

చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రేస్
(సీఆర్ ఫౌండేషన్) ఆధ్వర్యములో నడుస్తున్న సీఆర్ పాలిక్లినిక్, డయాగ్నస్టిక్ సెంటర్ ఈరోజు బస్తీ దవాఖాన ప్రేమనగర్ న్యూ హఫీజ్ పెట్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరములో సీ ఆర్ పాలిక్లినిక్ జనరల్ మరియు స్త్రీ వ్యాధుల వైద్య నిపుణులు డా. కె. రజని , డా. అరుణ , డా. కేజియా, దంత వైద్యులు డా. అజయ్, డా. ప్రశాంతి, ఫిజియోథెరపీ వైద్యులు డా. అనిల్ చంద్, MAA హాస్పిటల్ నుంచి చెవి ముక్కు గొంతు వైద్యులు డా. ముదిత్, కిమ్స్ హ్సాపిటల్ నుంచి పిల్లల వైద్యులు డా. యుక్త వర్మ, త్రిష, శుభ్ర, సీనియర్ హోమియోపతి డా. సి హెచ్. ప్రభావతి, జేఎస్పీఎస్ గవర్మెంట్ హోమోయోతి కాలేజ్ డాక్టర్లు సంయుక్త , స్నేహిత, సింధూజ, విశాల్ తమ సేవలు అందించారు. సీఆర్ పాలిక్లినిక్ టెక్నికల్ పార్టనర్ కనెక్ట్ డైగ్నోసిస్ వారు ఉచిత రక్త పరీక్షలు , హీలియోస్ లంగ్ సెంటర్ వారు పిఎఫ్టీ పరీక్షలు, ఎల్ వి ప్రసాద్ నేత్రాలయం డా. రమ్య , డా. రాజేశ్వరిత్, డా. శిల్ప నేత్ర చికిత్సలు నిర్వహించారు.

ఈ శిబిరం ఏర్పాటులో హైదరాబాద్ మ్యావరిక్స్ రోటరీ క్లబ్ సభ్యులు గోగినేని శేఖర్, డి. లక్షినారాయణ, వాసిరెడ్డి నాగేశ్వర రావు, కె అజయ్ కుమార్ , డి. అనిత ఇతరులు తోడ్పాటు అందించారు. 250 కి పైగా ప్రేమనగర్ వాసులు ఈ ఉచిత వైద్య శిబిర సేవలు సినియోగించుకున్నారు.
వైద్య శిబిరం విజయవంతం కావటానికి సహకరించిన సిఆర్ పాలిక్లినిక్, సిఆర్ ఫౌండేషన్ సిబ్బందిని, వాలంటీర్లను సిఆర్ పాలిక్లినిక్ డైరెక్టర్ డా. రజని , కార్యనిర్వహణాధికారి కె విజయ లక్ష్మి ,ఎన్ ఆర్ ఆర్ పరిశోధన కేంద్రం కమిటీ సభ్యులు డి. శ్రీనివాస రావు , సీఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కె. అజయ్ కుమార్ అభినందించారు. భవిషత్తులో సీఆర్ పాలిక్లినిక్ పరిసరాలలోని ప్రాంతాలలో ప్రతి నెల ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని, అలాగే ప్రతి రెండవ శనివారం సిఆర్ పాలిక్లినిక్ లో ఉచిత కన్సల్టేషన్స్ ఇవ్వబడుతుందని, అందరికీ అందుబాటులో విశ్వసనీయ వైద్య సేవలు అందిచటమే లక్క్ష్యంగా పని చేస్తున్నట్లు డైరెక్టర్ డా. రజని పేర్కొన్నారు.