(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*కల్చరల్ సెంటర్ ను ప్రారంభించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీకార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .*
నేటి సత్యం డిసెంబర్ 14
*శేరిలింగంపల్లి డివిజన్ లోగల సెంట్రల్ పార్క్ ఫేస్- 1 కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కల్చరల్ సెంటర్ ను పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరేకపూడి గాంధీ గారితో కలిసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు, యాంత్రిక జీవనానికి పరిష్కారం చూపించేవి ఇలాంటి కల్చరల్ సెంటర్స్ అంటూ అభిప్రాయపడ్డారు. ఇంతటి అద్భుతమైన కల్చరల్ సెంటర్ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, సెంట్రల్ పార్క్ ఫేస్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ కృష్ణ, జనరల్ సెక్రటరీ వీ ధనుంజయ, వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ, ట్రజారర్ సంతోష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మురళీధర్ డీఎల్ఎస్ఎన్ ప్రసాద్ రావు, టీ చంద్రశేఖర్, సతీష్ కుమార్, శ్రీధర్ రెడ్డి మరియు మల్లేష్ యాదవ్, పవన్ స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.*