గన్నేరువరం మండలంలోప్రశాంతంగా ఎన్నికలపోలింగ్.
గన్నేరువరం, (నేటి సత్యం)డిసెంబర్ 14:
కరీంనగర్ జిల్లా:గన్నేరువరం మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 17 గ్రామాలు ఉండగా ఇందులొ రెండు గ్రామాలు పీచుపల్లి,గోపాలపుర్ గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా 15 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించగా గ్రామాల్లో 17430 ఓటర్లు ఉండగా 15,435 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 88.6% నమోదు. అయింది. మండలంలో పలు గ్రామాల సర్పంచులు గెలుపొందిన వివరాలు ఇలా ఉన్నాయి. గన్నేరువరం మండల కేంద్రం లొ రంగనావేణి లచ్చినర్సు, జంగపల్లి తాడూరి కరుణశ్రీ, హన్మాజీపల్లి నందికొండ అనంతం, గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు చింతల ఉమారాణి, గునుకుల కొండాపూర్ సొల్లు అజయ్ వర్మ, పారువెల్ల యాళ్ల లక్ష్మి రాంరెడ్డి, కాసింపేట కర్నే చంద్రయ్య, మైలారం గాలి పెళ్లి పోచవ్వ, మాదాపూర్ మ్యాదరి శ్రీనివాస్,గుండ్లపల్లి కాల్వ పద్మ, గోపాల్ పూర్ ఆకుల కవిత,పి చుపల్లి సామ నాగిరెడ్డి, చీమలకుంట్టపల్లి జంగిటి ప్రకాష్,చొక్క రావుపల్లి అరికొంతం గోపాల్ రెడ్డి, సాంబయ్య పల్లి గడ్డం రమ్య, యస్వాడ కటకం తిరుపతి, చాకలి వాని పల్లి రేపాక బాణవ్వ,లు గెలుపొందారు.