*పంచాయతీ ఎన్నికల్లో బంధుత్వాల పోరు.. తండ్రిపై కొడుకు, మామపై కోడలు!*
గ్రామపంచాయతీ ఎన్నికలు ఈసారి రాజకీయాలకే కాదు, కుటుంబ సంబంధాలకు కూడా పరీక్షగా మారాయి. బంధాలు, అనుబంధాలు పక్కనపడి ప్రజల తీర్పే ప్రధానమని నిరూపించే విధంగా మెదక్, జగిత్యాల జిల్లాల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో తండ్రి–కొడుకుల మధ్య సర్పంచ్ పదవికి జరిగిన పోరు స్థానికంగా ఉత్కంఠను రేకెత్తించింది. కుమారుడు వెంకటేష్‌పై తండ్రి 99 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కుటుంబ సభ్యుల మధ్యే నేరుగా పోటీ జరిగినా, గ్రామాభివృద్ధి, అనుభవం, ప్రజల నమ్మకమే తన విజయానికి కారణమని గెలిచిన తండ్రి తెలిపారు. ఈ ఫలితం గ్రామ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది.
అదే సమయంలో జగిత్యాల జిల్లాలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మామపై కోడలు సర్పంచ్‌గా పోటీ చేసి, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని విజయం సాధించారు. మహిళా నాయకత్వానికి గ్రామస్థులు మద్దతు ఇచ్చిన ఈ ఫలితం కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ రెండు ఘటనలు గ్రామ రాజకీయాల్లో బంధుత్వాల కంటే ప్రజాస్వామ్యమే పైచేయిగా నిలుస్తుందన్న స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాయి.ఓటు అనేది వ్యక్తిగత సంబంధాలకన్నా ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఆయుధమని మరోసారి రుజువైంది.