పంచాయితీ ఎన్నికలలో బంధుత్వాల పోరు.
*పంచాయతీ ఎన్నికల్లో బంధుత్వాల పోరు.. తండ్రిపై కొడుకు, మామపై కోడలు!* గ్రామపంచాయతీ ఎన్నికలు ఈసారి రాజకీయాలకే కాదు, కుటుంబ సంబంధాలకు కూడా పరీక్షగా మారాయి. బంధాలు, అనుబంధాలు పక్కనపడి ప్రజల తీర్పే ప్రధానమని నిరూపించే విధంగా మెదక్, జగిత్యాల జిల్లాల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో తండ్రి–కొడుకుల మధ్య సర్పంచ్ పదవికి జరిగిన పోరు స్థానికంగా ఉత్కంఠను రేకెత్తించింది. కుమారుడు వెంకటేష్‌పై తండ్రి 99 ఓట్ల మెజారిటీతో ఘన...