(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఆముదాలవలస* *పట్టణంలో ఘనంగా జరిగిన అభ్యుదయం* *సైకిల్ యాత్ర*
*మత్తు రహిత సమాజమే కూటమి ప్రభుత్వ* *ధ్యేయం – ఎమ్మెల్యే కూన రవికుమార్*
మత్తు రహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన “అభ్యుదయం సైకిల్ యాత్ర” గొప్ప సామాజిక ఉద్యమమని ఆయన అభివర్ణించారు.
ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస పట్టణంలో ఈ రోజు నిర్వహించిన అభ్యుదయం సైకిల్ యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మత్తు పదార్థాలు వ్యక్తి జీవితాన్నే కాదు, కుటుంబం, సమాజం భవిష్యత్తునూ నాశనం చేస్తాయని హెచ్చరించారు.
ప్రతి పౌరుడు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ఉందని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు సహకరించాలని కూన రవికుమార్ గారు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మత్తు వ్యతిరేక ఉద్యమం విస్తరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో DSP వివేకానంద గారు జిల్లా తేదేపా అధ్యక్షుడు మొదలవలస రమేష్ గారు డిసిసిబి చైర్మన్ శివాల సూర్యనారాయణ, జనసేన ఇంచార్జ్ రామ్మోహన్ గారు, మార్కెఫెడ్ డైరెక్టర్ ఆనేపు ర్రామకృష్ణ గారు ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సైకిల్ యాత్రను విజయవంతం చేశారు. మత్తు రహిత సమాజ సాధనకు ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని ఎమ్మెల్యే గారు కోరారు.