Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedఈరోజు శుభ ఘడియలు శుభ నక్షత్రాలు

ఈరోజు శుభ ఘడియలు శుభ నక్షత్రాలు

ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – *దీర్ఘాయుష్మాన్ భవ!*

*18, డిసెంబర్, 2025*
*దృగ్గణిత పంచాంగం* 
➖➖➖✍️

🌺ఈనాటి పర్వం:*మాసశివరాత్రి*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం*
*హేమంత ఋతౌః / మార్గశిర మాసం / కృష్ణపక్షం*

*తిథి  : చతుర్దశి* ‌రా 04.59 తె వరకు ఉపరి అమావాస్య
*వారం    : గురువారం* (గురువాసరే)
*నక్షత్రం  : అనూరాధ* రా 08.07 వరకు ఉపరి జ్యేష్ఠ

*సూర్యోదయాస్తమాలు:*
ఉ06.30;సా05.39విజయవాడ
ఉ06.40;సా05.46హైదరాబాద్
*సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి : వృశ్చికం*
*యోగం : ధృతి* మ 03.06 వరకు ఉపరి శూల
*కరణం  : భద్ర* మ 03.47‌ ఉపరి శకుని రా 04.59 తె వరకు

*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం  : ఉ 08.27 – 10.14
అభిజిత్ కాలం  : ప 11.42 – 12.26
*వర్జ్యం    : రా 02.21 – 04.08*
*దుర్ముహూర్తం  : ఉ 10.13 – 10.57 మ 02.40 – 03.25*
*రాహు కాలం   : మ 01.28 – 02.51*
గుళికకాళం      : ఉ 09.17 – 10.41
యమగండం    : ఉ 06.30 – 07.53
*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం          : ఉ 06.30 – 08.43
సంగవ కాలం         :     08.43 – 10.57
మధ్యాహ్న కాలం    :    10.57 – 01.11
అపరాహ్న కాలం    : మ 01.11 – 03.25

*ఆబ్ధికం తిధి         : మార్గశిర బహుళ చతుర్దశి*
సాయంకాలం        :  సా 03.25 – 05.39
ప్రదోష కాలం         :  సా 05.39 – 08.12
రాత్రి కాలం           :  రా 08.13 – 11.39
నిశీధి కాలం          :   రా 11.39 – 12.30
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.47 – 05.39.✍️

*గూడూరు మల్లిఖార్జున్ రెడ్డి*

➖▪️➖
*18-12-2025-గురువారం*
*రాశి ఫలితాలు:*
➖➖➖✍️
“`
మేషం
ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం
చిన్ననాటి మిత్రులతో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.

మిధునం
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కర్కాటకం
జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

సింహం
మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణకు భాగస్తులు నుండి సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు.

కన్య
దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.

తుల
వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం
ఉద్యోగస్తులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాలాబాట పడుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనస్సు
అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

మకరం
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం
వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

మీనం
విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది.✍️“`
*************************
*గూడూరు మల్లిఖార్జున్ రెడ్డి*

. *శుభమస్తు!* ________________________
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments