గ్రామాలకు కొత్త సర్పంచులు వచ్చారు సమస్యలు తీరేనా?
తెలకపల్లి నేటి సత్యం డిసెంబర్ 18
గ్రామాల్లో గత రెండు సంవత్సరాలుగా సర్పంచులు లేకపోవడంతో గ్రామాలన్నీ సమస్యలతో సతమౌతు మౌలిక సమస్యల పరిష్కారానికి కూడ నోచుకోకుండా ఉన్నాయి .
ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. వీటికి తోడు వీధి దీపాలు వెలుగక పోవడం తో గ్రామల్లో వీధులు. అంధకారంలో ఉన్నాయి.అభివృద్ధి పనులు ఆగిపోవడం . తదితర సమస్యలతో గ్రామాలన్నీ సత మత మౌతున్నాయి కొత్త సర్పంచులు ఈ సమస్యలను పరిష్కరించడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతారో చూడాలని ఆయా గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో మూడు దశలుగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తెలకపల్లి మండలంలో మొదటిదశ ఈనెల 11 వ తేదీన ఎన్నికల నిర్వహించారు .
మండలంలో మొత్తం 28 గ్రామ పంచాయతీలకు గాను మూడు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .
మిగతా 25 గ్రామాల సర్పంచు స్థానాలకు వార్డు సభ్యుల స్థానాల కు వివిధ పార్టీల మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు హోరాహోరి గా ప్రచార నిర్వహించి వివిధ పార్టీల అభ్యర్థులు సర్పంచ్ లు గా విజయం సాధించారు.
జంగమోనిపల్లి గ్రామ సర్పంచ్ గా తిరుపతయ్య కాంగ్రెస్. చిన్న ముద్దునూరు సర్పంచ్ గా రుక్సానా బేగం కాంగ్రెస్. పర్వతాపూర్. సర్పంచ్ గా ప్రసన్న బి ఆర్ఎస్. దాసు పల్లి సర్పంచ్ గా శ్రీదేవి కాంగ్రెస్. బోడబండ తాండ సర్పంచ్ గా మోతిరామ్ బిఆర్ఎస్. నడిగడ్డ సర్పంచ్ గా శశికళ బిఆర్ఎస్ .గడ్డంపల్లి సర్పంచ్ గా వెన్నెల కాంగ్రెస్. కమ్మారెడ్డి పల్లి సర్పంచ్ గా మమత కాంగ్రెస్ .అనంతసాగర్ సర్పంచ్ గా గౌరమ్మ బిఆర్ఎస్ .బండపల్లి సర్పంచిగా సురేందర్ రెడ్డి కాంగ్రెస్. బొప్పెల్లి సర్పంచ్ గా నవ్య కాంగ్రెస్ .గోల గుండం సర్పంచ్ గా గోవర్ధన్ రావు బి ఆర్ఎస్.గౌరారం సర్పంచ్ గా మల్లేశ్వరి కాంగ్రెస్ .గౌతమ్ పల్లి సర్పంచ్ గా సునిత కాంగ్రెస్. పెద్దపల్లి సర్పంచ్ గా బుగ్గ స్వామి కాంగ్రెస్ . పెద్దూర్ సర్పంచ్ గా చక్రవర్తి గౌడ్ కాంగ్రెస్ .రాకొండ సర్పంచ్ గా. స్వామి కాంగ్రెస్ .తెలకపల్లి సర్పంచ్ గా చంద్రశేఖర్ కాంగ్రెస్. వట్టిపల్లి సర్పంచ్ గా విష్ణువర్ధన్ రావు కాంగ్రెస్ .జమిస్తాపూర్ సర్పంచ్ గా నాగమ్మ బిఆర్ఎస్. గట్టు రాయి పాకుల సర్పంచ్ విజయ్ (ఏకగ్రీవం ఉమ్మడి అభ్యర్థి ) తాళ్ళపల్లి సర్పంచ్ గా పిశ్రీనివాసులు( ఏకగ్రీవం కాంగ్రెస్) రామ్ రెడ్డిపల్లి సర్పంచ్ గా యాదవరెడ్డి (ఏకగ్రీవం కాంగ్రెస్ ) గట్టు నెల్లి కుదురు సర్పంచ్ గా సి. చంద్రారెడ్డి కాంగ్రెస్ .ఆలేరు సర్పంచ్ గా టి. ఆనంద్ బి ఆర్ఎస్. లక్నారం సర్పంచ్ గా డి.సువర్ణ బి ఆర్ఎస్. కార్వంగ సర్పంచ్ గా అమరేందర్ రెడ్డి కాంగ్రెస్. గౌరెడ్డిపల్లి జిల్కరి శిరీష కాంగ్రెస్. సర్పంచులు గా ఎన్నికయ్యారు మొత్తంగా మండలంలో 28 సర్పంచుల గాను కాంగ్రెస్ పార్టీ సర్పంచులు 19 మంది ఒక్కరు ఉమ్మడి సర్పంచ్.బిఆర్ ఎస్ సర్పంచ్ లు 8 మంది విజయం సాధించారు.నూతన సర్పంచులు ఈనెల 22 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలు చేపట్టనున్నారు.మరి సమస్యల పరిష్కారానికి ఏమేరకు కృషి చేస్తారో వేచి చూడాలన్న చర్చ గ్రామాల్లో జోరుగా సాగుతోంది.