Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 December 2025, 12:59 pm Editor : Admin

సురవరం సుధాకర్ రెడ్డి మహా విప్లవ నేత ఆయన ఆశయాల కోసం పోరాడాలి పల్ల వెంకట్ రెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సురవరం సుధాకర్ రెడ్డి మహా విప్లవ నేత ఆయన ఆశయ సిద్ధి కోసం కమ్యూనిస్టు నాయకులు పోరాడాలి
సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి

నేటి సత్యం.శంషాబాద్ డిసెంబర్ 18

సిపిఐ అగ్ర నాయకుడు అమరజీవి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప విప్లవ నేత అని ఆయన ఆశయ స్ఫూర్తి కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త పోరాడాలి అని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు
సిపిఐ శత వారోత్సవాలను పురస్కరించుకొని సురవరం సుధాకర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పల్లా వెంకటరెడ్డి క్రీడాకారులను సిపిఐ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు
క్రీడలు మానసిక ఉత్తేజాన్ని దేహదారుడ్డి అని పెంచుతాయని క్రీడలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని మండల కేంద్రానికి ఒక స్టేడియాన్ని నిర్మాణం చేస్తే గ్రామాలలోని యువతి.యువకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు
ప్రపంచ దేశాలలో స్టేడియాలను అద్భుతంగా నిర్మాణం చేసి క్రీడాలను ప్రోత్సహిస్తుంటే మన ప్రభుత్వాలు మాత్రం క్రీడాకారులకు మండి చేయి చూపడం బాధాకరమని ఆయన విమర్శించారు
ఎమ్మెల్సీ నెలికంటి సత్యం మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకత్వం క్రికెట్ పోటీలను నిర్వహించి యువతను క్రీడల వైపు వెళ్ళే విధంగా నిర్వహించిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
ఫైనల్ మ్యాచ్ లో పర్వతాలు సూపర్ కింగ్స్ మరియు ఆల్ఫాతి రాయల్ కార్ సిసి టీములు ఫైనల్లో పోటీ పడ్డాయి ఈ పోటీలో పర్వతాలు సూపర్ కింగ్స్ జట్టు ఛాంపియన్గా ఎన్నికైన
ఎన్నికైన విన్నర్ టీం మొదటి ట్రోపీని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అందజేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు కే రామస్వామి టీ రామకృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం భారతరాజు నరసింహ ఆర్ యాదగిరి ఎం ఏ రియాజ్ కే నరసింహారెడ్డి సిపిఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి శేర్లింగంపల్లి మండల కార్యదర్శి కె చందు యాదవ్ మహిళా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల
క్రికెట్ నిర్వాకులు ప్రవీణ్ కుమార్ గౌడ్ రాజేందర్ గౌడ్ ఎండి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు