Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 December 2025, 1:11 pm Editor : Admin

శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శేరిలింగంపల్లి నియోజకవర్గం మ్మెల్యే బీ.ఆర్. ఎస్ పార్టీ లో ఉన్నారా?కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారా?

స్పీకర్ గారి నిర్ణయం ప్రకారం మ్మెల్యే గారు బీ.ఆర్.ఎస్ పార్టీ లొనే వున్నారు?

నేటి సత్యం శేరిలింగంపల్లి డిసెంబర్ 18

మ్మెల్యే గారు బీ.ఆర్.ఎస్ పార్టీ లొనే ఉంటే 21 తేదీ నాడు .కె.సి.ఆర్ గారి అధ్యక్షతన బీ. ఆర్.ఎస్ భవన్ లో జరిగే సమావేశానికి బీ.ఆర్ ఎస్ కండువా కప్పు కొని సమావేశానికి హాజరు కావాలి .

బీ.ఆర్ ఎస్ పార్టీ సమావేశనికి మీరు హాజరు కానీ ఎడల శేరిలింగంపల్లి ప్రజలు బీ.ఆర్.ఎస్ పార్టీ లో మీరు వున్నారు అని ఎలా నమ్ముతారు…

ఇప్పటి నుండి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగే బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యక్రమాలకు బీ.ఆర్. ఎస్ కండువా వేసుకొని పాల్గొనాలి.

సర్వే నెంబర్ 307 గాజులరామరం, మీ కుటుంభం పేరు మీద ఉన్న భూమిని కాపాడుకోవడానికి మరియు శంషిగూడ సర్వే నం 57 లోని వివాద ప్రభుత్వ భూమిని పరిష్కరించు కోవడానికి కాంగ్రెస్ పార్టీ లోకి పోయారు అని ప్రజలు అనుకుంటున్నారు.

మీ సహచర కుకట్పల్లి మ్మెల్యే కృష్ణా రావు వారు ఐడిపిల్ భూములను అక్రమించాడు అని ఆరోపణలను ఆయన స్వయంగా కేంద్ర ప్రభుత్యానికి,రాష్ట్ర ప్రభుత్యానికి విజిలన్స్ కు తన మీద విచారణ జరిపి నిజానిజాలను నిరూపించాలని తన పై తానే లిఖితపూర్వకంగా విచారణ కోరడం జరిగినది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

శేరిలింగంపల్లి ప్రజల ఓట్లతో గెలిచి మ్మెల్యే అయిన మీరు మీ మీద వచ్చిన ఆరోపణలను తప్పుడు సమాచారం అని నిరూపించుకొనుటకు… మ్మెల్యే కృష్ణ రావు గారి లాగా మీరు కూడా రాష్ట్ర ప్రభుత్యానికి,కేంద్ర ప్రభుత్యానికి,విజిలెన్స్ కు నీ పై ఆరోపణలను… విచారణ జరపాలని నిజానిజాలను నిరూపించాలని దర్యాపు సంస్థలను కోరి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి … మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ వివాద భూముల పై విజిలెన్స్ విచారణ ఎందుకు వేయట లేదు అందుకే మీ పై వచ్చిన ఆరోపణలు నిజమే అని ప్రజలు నమ్మే అవకాశం ఉంది.

నియోజవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ లో చేరాను అని ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా లో మీరు మాట్లాడిన వార్తలను ప్రజాలు విన్నారు,….చూసారు ..

స్పీకర్ గారి కోర్ట్ లో తీర్పు అనుకూలంగా వచ్చిన రాబోయే ఎన్నికలలో శేరిలింగంపల్లి ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి తగిన బుద్ధి చెబుతారు.

బీ.ఆర్.ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటు వేసి మ్మెల్యే గెలిపించిన ప్రజలను అవమానించకుండా… నియోజకవర్గo పరువు తీయకుండా… కాంగ్రెస్ పార్టీ లో చేరలేదని గుండె మీద చేయివేసికొని ప్రజలకు సమాధానం చెప్పాలని.అది నిజమే అని ప్రజలు నమ్మలంటే రేపటి నుండి బీ.ఆర్.ఎస్ పార్టీ కండువా వేసుకొని తిరగాలి అని, లేని యెడల మ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి శేరిలింగంపల్లి ప్రజల తీర్పు కోరాలని మేము శేరిలింగంపల్లి బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులం,కార్యకర్తలం అందరం డిమాండ్ చేస్తున్నాం …

ఈ కార్యక్రమంలో సామ వెంకట్ రెడ్డి,బొబ్బ నవత రెడ్డి,కలిడింది,రోజా,వాలా హరీష్,రవి యాదవ్,సతీష్ రావు,శ్రీకాంత్ యాదవ్,పరనంది శ్రీకాంత్,సంతోష్ రెడ్డి,మల్లరెడ్డి,సంగా రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,శ్రీనివాస్,సుబ్బా రాజు,సలీం,ప్రకాష్,ప్రమోద్,వంశీ,అనంత రెడ్డి,శ్రీకాంత్ యాదవ్,నర్సింహ రెడ్డి,మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.