*ఎల్లమ్మబండ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తా – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్*
ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నష్టపోయిన వారికి టి.డి.ఆర్ లు అందేలా ప్రయత్నం చేసి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ గారుతో మరియు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇపిస్తానని అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు తెలియచేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగినది, విస్తరణ పనులు వేగంగా చేసి ఎల్లమ్మబండ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తొలగిస్తామని అన్నారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రికల్ స్థంబాలను త్వరితగతిన స్థాన భ్రంశం చేయాలని, అదేవిధంగా రోడ్డు డివైడర్ మధ్యలో సుందరికరణ పనులు చేపట్టాలని, మౌలిక వసతుల కల్పనలో అలసత్వం ప్రదర్శించకుండా రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.