Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 December 2025, 2:09 pm Editor : Admin

గన్నేరువరం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ .




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గన్నేరువరం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ.

—నూతన సర్పంచి రంగనావేణి లచ్చి నర్సు ఆధ్వర్యంలో

గన్నేరువరం, నేటి సత్యం, డిసెంబర్ 18 :

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో నూతనంగా ఎంపికైన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గెలుపొందిన సందర్భంగా ఘనంగా భారీగా మండల కేంద్ర ప్రజలతో విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారు. గన్నేరువరం మండల కేంద్ర సర్పంచ్ గా రంగనవేణి లచ్చి నర్సు, ఉప సర్పంచ్ రామంచ స్వామి, వార్డు మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ లచ్చి నర్సు మాట్లాడుతూ గన్నేరువరం గ్రామ ప్రజలకు నన్ను గెలిపించినందుకు వాళ్లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నాను అలాగే నా పైన నమ్మకం ఉంచి నాకు ఓటు వేసి నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నిక కాబడ్డ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.