Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaఏకపక్షంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. చాడ వెంకటరెడ్డి

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. చాడ వెంకటరెడ్డి

*ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.*

*బిజెపికి మహాత్మా గాంధీ మీద కోపంతోనే ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు.*
నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 19

సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి.

పార్లమెంట్ లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఏకపక్షంగా మహాత్మ గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చారని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. అప్రజాస్వామికంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు ఎన్డీఏ ప్రభుత్వం పాల్పడుతున్నదని వారు పేర్కొన్నారు.
బిజెపి మహాత్మా గాంధీ మీద ఉన్న కోపంతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజివికా మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఉన్నదని, రాష్ట్రాలపై భారం మోపడానికే ఈ కొత్త చట్టం తీసుకొచ్చారని వారన్నారు. గతంలో రాష్ట్రాలవాట 60 శాతం ఉంటే ఇప్పుడు రాష్ట్రాలకు 90 శాతం నిధులు కేటాయించాలి అనే విధంగా చట్టం తీసుకొచ్చారని, కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడి ఉంటే పథకాన్ని అమలు చేయడం కష్టమవుతుందని, వ్యవసాయ కూలీల పట్ల ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు, వాపక్ష పార్టీలు, వ్యవసాయ కూలి సంఘాలు ఉద్యమించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకించాలని వారన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments