నేటి సత్యం **ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం*
*విద్యుత్ స్తంభాల స్దాన భ్రంశం పనులలో వేగం పెంచాలని విద్యుత్ అధికారులకు ఆదేశం*
*ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలి గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు*
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు చేపడుతున్న వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను గౌరవ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం, విద్యుత్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామరం వెళ్లే రోడ్డు వయా ఎల్లమ్మబండ రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని ,ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగినది అని ,దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై అధికారులు, కార్పొరేటర్ తో కలిసి ఉషముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర గా స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. 100 ఫీట్ రోడ్డు విస్తరణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యల పై చర్చించి, ప్రణాళిక ను రూపొందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని , యుద్ధప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డు విభాగిని పనులు నాణ్యత ప్రమాణాలు తో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, అధికారులను PAC చైర్మన్ గాంధీ గారు అదేశించడం జరిగినది. ఉషముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తి వరకు ఎల్లమ్మ బండ రోడ్డు విస్తరణలో
భాగంగా రోడ్డు పక్కన గల విద్యుత్ స్థంబాలను స్థాన భ్రంశం చర్యలను వెంటనే చేపట్టాలని, అదేవిధంగా రోడ్డు డివైడర్ మధ్యలో సుందరికరణ పనులు చేపట్టాలని.ఎల్లమ్మబండ రోడ్డు లో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది కావున విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని మరియు
రోడ్డుల విస్తరణ పనులు పై అధికారులకు పలు సూచనలు, సలహాలు తెలియచేయడం జరిగినది. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,రోడ్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రికల్ స్థంబాలను త్వరితగతిన స్థాన భ్రంశం చేయాలని, 100 ఫీట్ రోడ్డు విస్తరణ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా చూడాలని,ఈ100 ఫీట్ రోడ్డు విస్తరణ వలన ప్రజలకు సమయం ,ఇంధనం ఆదా అవుతుంది అని,మౌలిక వసతుల కల్పనలో అలసత్వం ప్రదర్శించకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని PAC చైర్మన్ గాంధీ గారు అధికారులను ఆదేశించడం జరిగినది.,ట్రాఫిక్ సమస్య నివారణకై , నాణ్యమైన ,మన్నిక గల రోడ్లను నిర్మిస్తామని , ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని PAC చైర్మన్ గాంధీ గారు చెప్పడం జరిగినది .ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ గారు చెప్పడం జరిగినది. 100 ఫీట్ రోడ్డు విస్తరణ పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది అని,ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
అదేవిధంగా శేరిలింగంపల్లి
నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ గారు. పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE గోవర్ధన్, DE రమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి , విద్యుత్ విభాగం అధికారులు ADE శ్యామ్ మరియు నాయకులు ,కార్యకర్తలు ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు