Neti Satyam
Newspaper Banner
Date of Publish : 19 December 2025, 5:04 pm Editor : Admin

రాముడు చెప్పాడా సార్ పేరు మార్చమని




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాముడు చెప్పిండా సారూ,
పథకం పేరు మార్చమని!

నేటి సత్యం. డిసెంబర్ 19
రాముడు చెప్పిండా సారు
పేరు మార్చ మంటని.
దేవుడు చెప్పిండా
ప్రజల పొట్టకొట్టమంటని..

ఉపాధి పతకాన్ని
ఉసురు తీసి సంపకండి..
క్కార్పో రేట్ల మెప్పు కొరకు
కూలీల కడుపు కొట్టకండి.

దేశాన్ని ఏలుతున్న
మోడీ సారు.
కూలీల ఉసురు తాకి
పోతరు చూడు మీరు….

పొట్ట చేత వట్టు కొని
కూలీ పోయే టోల్లకు
రెక్కలాడ కుంటే
బక్క బువ్వ దొరక నోళ్లకు
పని అడిగే హక్కును
రాజ్యాంగమే ఇచ్చింది.
ఆ పోరాట ఫలితమే
ఉపాధి చట్టం వచ్చింది.
ఆ చట్టానికి ఇప్పుడు
తూట్లు పోడువ చూస్తరా.
పేదోడి నోటికాడి
ముద్ద గుంజుకుంటారా…

గాంధీ పేరు పెట్టితే
భూకంపం పుడుతుందా
మహాత్ముని పేరు వింటే
మీ రాజ్యం కూలుతుందా
మబ్బులు అడ్డం వస్తే
సూర్యుడు ఆగిపోతాడా
పేరు మార్చగానే గాంధీ
చరిత మాసిపోతుందా
పథకాల పేర్లు మార్చి
అభివృద్ధి అంటారా.
నక్క బుద్ధి రాజకీయం
ఇక మానుకుంటారా..

దేశం లో సగం మంది
భూమిలేని పేదలుంటే
పేదోడికి ఒక్క సెంటు
భూమి పంచ పోతిరి.
ఉపాధి హామీ పథకం తో.
పొట్ట గడుపు కుంటుంటే
ఏటేటా బడ్జెట్లో..
నిధులు కోత పెడితిరి
ఇప్పుడు చట్టంలో మార్పు పేర
రాష్ట్రాల మీద తోసి.
తప్పించుకు చూస్తారా
కారు కూతలు కూసి.

జీడీపీ పెరిగిందని
సంకలు గుద్దు తున్నరు
అదానీల ఆస్తి చూసి
సంబర పడుతున్నరు
ఉపాధి కూలీల..
వేతనాలు పెంచమంటే
వున్న పథకాన్నీ కూడ
వురిపోసి సంపు తుండ్రు.
కూలీల పొట్టకొడితే.
తేనె తేట్ట కదులుతుంది.
చట్టాన్ని మార్చ చూస్తే.
మీ పాలన కూలుతుంది!