(adsbygoogle = window.adsbygoogle || []).push({});
167కె జాతీయ రహదారి పై
ప్రమాదం లో కానిస్టేబుల్ మృతి..
కొల్లాపూర్, నేటి సత్యం ,డిసెంబర్ 20.
విధులు ముగించుకొని స్వగ్రామానికి మోటార్ సైకిల్ పై వెళుతున్న పెద్దకొత్తపల్లి మండల పోలీస్ కానిస్టేబుల్ ఆంజనేయులు రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన సంఘటన ఇది.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గము పెద్దకొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు (42) శుక్రవారం రోజు విధులు ముగించుకుని రేవెల్లి మండలం లోని స్వగ్రామమైన శాయిన్ పల్లి కి మోటార్ సైకిల్ పై వెళుతుండగా పెద్దకొత్తపల్లి మండలం వావిళ్ళ బావి గ్రామము దగ్గర 167 కె రహదారిపై ప్రమాదానికి గురై చనిపోయాడు.
ప్రమాదానికి గల కారణాల గురించి పెద్దకొత్తపల్లి మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా తమలో ఒకడిగా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదం లో ఆకస్మికం గా ఆంజనేయులు మృతి చెందడం పట్ల పెద్ద కొత్తపల్లి మండల పోలీస్ సిబ్బంది తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.