*మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి జి రామ్ జి పేరును వెంటనే తొలగించాలి*
*ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టాలి*
*సిపిఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య*
*మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహా మహాత్మా గాంధీ పేరు తొలగించి జి రామ్ జి పేరు పెట్టడం మోడీ అధికార దురహంకారానికి నిదర్శనమని బిజెపి ఆలంబిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది*
*ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడుతూ*
*ఉపాధి హక్కును హరించే ‘జీ–రామ్–జీ’ బిల్లు ఆమోదం*
*ప్రజలకు నమ్మకద్రోహం – ప్రజాస్వామ్యానికి మరో చీకటి రోజు ఆయన అన్నారు పార్లమెంటులో ఎవరి ఆమోదం లేకుండా ఏకపక్షంగా బిల్లు తీసుకురావడం కనీసం చర్చకు కూడా అవకాశం లేకుండా బిల్లు ఆమోదింప చేయడం మోడీ దురహంకారానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా* *విమర్శించారు*
**మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)* *ను రద్దు చేస్తూ, ఉపాధిని హరించే ‘జీ–రామ్–జీ (G-RAM-G)’ అనే నూతన బిల్లును లోక్‌సభలో బలవంతంగా ఆమోదింపజేసింది. ఇది గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, కూలీలకు చేసిన ఘోర నమ్మకద్రోహం. ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు ఆయన అన్నారు*
*ఎంఎన్‌ఆర్‌ఈజీఏ ఎవరి దయా పథకం కాదు అని . అది ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న చట్టబద్ధమైన ఉపాధి హక్కు. పని అడిగితే పని ఇవ్వాల్సిందే అనే బాధ్యతను ప్రభుత్వంపై మోపిన చట్టం. అలాంటి హక్కు ఆధారిత చట్టాన్ని రద్దు చేసి, ఉపాధిని కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారంగా ఇవ్వబడే భిక్షగా మార్చడం ఈ బిల్లులోని అసలు ఉద్దేశ్యం*
*ఈ బిల్లును పార్లమెంటులో చర్చ లేకుండా*, *ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ ఆమోదించారు*
*ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇవ్వలేదు*
*సెలక్ట్ కమిటీకి పంపాలన్న డిమాండ్‌ను* *తిరస్కరించారు*
*ఇది పూర్తిగా నియంతృత్వ పద్ధతిలో చట్ట నిర్మాణం చేసినట్టే*
*రెండు రోజులలోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పని పొందే హక్కు ఉన్న చట్టాన్ని బుల్డోజర్‌లా కూల్చివేశారు. పేదల ఉపాధిపై, జీవనంపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ మోడల్‌ను అమలు చేసింది*
*మహాత్మా గాంధీని చంపిన గాడ్సే* *వారసులే, ఈ రోజు గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కూడా చంపారు*
*గాంధీ పేరు భరించలేని శక్తులే, ఆయన ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఉపాధి హక్కును హత్య చేశాయి*
‘ *జి రామ్ జి పేరుతో తెచ్చిన కొత్త చట్టం ద్వారా ఉపాధి హామీని హక్కు నుంచి తీసేసి, కేంద్ర ప్రభుత్వ దయపై ఆధారపడే పథకంగా దిగజార్చారు*
*ఉపాధి హక్కు రక్షణ అనేది కేవలం* *సంఘాల లేదా పార్టీల సమస్య కాదు*.
*రాజకీయ భేదాలు పక్కనపెట్టి*
*ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాద శక్తులు*
*అందరూ ఐక్యంగా ఈ పోరాటంలో నిలవాల్సిన అవసరం ఉంది*
*గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడేందుకు*
*యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కక్షపూరితంగా అధికార దృహంకారంతో పేర్లు మార్చడం పథకానికి తూట్లు పొడిచి కార్మికుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు.. రోజువారి వేతనాన్ని 600 రూపాయలు పెంచాలని ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశమంతా కాషాయీకరణ చేస్తామని మోడీ చెప్పుకోవడం అతని అవివేకమని ఆయన అన్నారు. ఎంతటి పెద్ద సర్పమైన చలిచీమల చేత చావదు అనే పదాన్ని గుర్తుంచుకోవాలని అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు అని మోడీ పగలు కలలు కంటున్నారని ఆయన సందర్భంగా అన్నారు. ఇప్పటికైనా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని జి రామ్ జి పేరును వెంటనే తొలగించాలని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు* *ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మధు నాయకులు వెంకటేష్ మల్లికార్జున్ బంగారయ్య కాజా నరసింహ యాదయ్య ముర్తుజా లక్ష్మయ్య కృష్ణయ్య బాలస్వామి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు*