శంషాబాద్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలి: అఖిలపక్ష రిలే నిరాహార దీక్ష
శంషాబాద్. డిసెంబర్ 20
గ్రేటర్ హైదరాబాద్‌లో శంషాబాద్ మండలాన్ని ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ నెరవేర్చాలని కోరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శంషాబాద్ మండలం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతం కావడంతో పాటు రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉందని, ఇక్కడి అభివృద్ధి కోసం ప్రత్యేక జోన్ స్థాపన అవసరమని అన్నారు. ప్రత్యేక జోన్ ఏర్పాటు వల్ల స్థానికులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని, ఈ డిమాండ్‌ను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ రిలే నిరాహార దీక్షలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాచమల్ల యాదగిరి, మండల కార్యదర్శి నర్రగిరి, సిపిఎం నాయకులు మల్లేష్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మంచాలతో మోహన్ రావు, సీనియర్ నాయకులు కనుమల శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, చిన్న గండు రాజేందర్, ఎమ్మార్‌పీఎస్ టౌన్ అధ్యక్షులు భాస్కర్ రమేష్, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు ఆనంద్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.