(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హెల్మెట్ ద్వారణ సామాన్య ప్రజలకేనా..?
పోలీసులకు వర్తించదా..? పట్టదా…?..
(యస్.పి. మల్లికార్జున సాగర్)
కొల్లాపూర్, నేటి సత్యం, డిసెంబర్ 20.
తనకు తాను నియమ నిబంధనలను పాటించ కుండా పోలీసు కానిస్టేబుల్ చేసిన చిన్న నిర్లక్ష్యానికి తన నిండు నూరేండ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగించుకుని కట్టుకున్న భార్యకు, పిల్లలకు కనిపెంచిన తల్లిదండ్రులకు, కడుపుకోతను బంధువులకు శోకాన్ని మిగిల్చి దివి కేగిన పోలీసు కానిస్టేబుల్ హృదయ విదారక సంఘటన ఇది.
ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు తలకు హెల్మెట్ దారణ చేయాలని పోలీసులు, రోడ్డు రవాణా శాఖ అధికారులు ఆంక్షలు విధిస్తారు..! హెల్మెట్ ధరించ కుండా వాహనాలు నడిపే వారిని గుర్తించి వారికి జరిమానాలు విధిస్తారు..! అని ఆ చట్టాలను అమలు చేసే పోలీస్ అదికారులు, పోలీస్ సిబ్బంది, రోడ్డు రవాణా సంస్థ అధికారులు హెల్మెట్ ధారణ నియమాన్ని నిబంధనను పాటించరా..? వారికి ఈ చట్టాలు వర్తించవా…? అని సామాన్య ప్రజలు పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం పెద్ద కొత్తపల్లి మండలం 167 కె జాతీయ రహదారి పై వావిళ్ళ బావి దగ్గర శుక్రవారం రాత్రి జరిగిన మోటార్ సైకిల్ ప్రమాదం లో పెద్దకొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఆంజనేయులు అక్కడికక్కడే చనిపోవడం జరిగినది.
శుక్రవారం విధులు నిర్వహించుకుని తన స్వగ్రామానికి పోలీస్ కానిస్టేబుల్ ఆంజనేయులు తన ద్విచక్ర వాహనము పై హెల్మెట్ లేకుండా వెళుతుండగా వావిళ్ళ బావి దగ్గర గుర్తు తెలియని వాహనము ఢీ కొట్టిన ప్రమాదం లో పోలీస్ కానిస్టేబుల్ ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగినది.
కాగా రాత్రులందు తన స్వగ్రామానికి బయలుదేరిన పోలీస్ కానిస్టేబుల్ ఆంజనేయులు తన తలకు హెల్మెట్ ను పెట్టుకుని వాహనాన్ని నడిపి ఉండి ఉంటే ప్రమాదం లో ఆయన గాయపడి ప్రాణాలను దక్కించుకునే వారని ప్రమాద సంఘటనలో పోలీస్ కానిస్టేబుల్ పడి మృతి చెందిన దృశ్యాలను చూసినవారు వ్యాఖ్యానించారు.
హెల్మెట్ ను తలకు ధరించ కుండా రోడ్లపై ద్విచక్ర వాహనాలను నడిపే వారిని దారి కాచి పోలీసులు గుర్తించి హెల్మెట్ ధరించ కుండా వాహనాన్ని నడుపుతున్నావు అంటూ వాహనదారులకు జరిమానాలు విధించే పోలీసు అధికారులే పోలీసు సిబ్బంది ఇలా తలకు హెల్మెట్ ధరించకుండా రాత్రులందు ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేయడం ఎంతవరకు సబబు.
సామాన్యులు పాటించడానికేనా..? ప్రభుత్వ నియమ నిబంధనలు.. నిబంధనలను పాటించాలని ప్రజలను జాగరూకులను చేసే పోలీసు సిబ్బందే తలకు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే వారికి ఎవరు జరిమానా విధించాలి..? అట్టి వారికి పోలీస్ అధికారులు, రోడ్డు రవాణా శాఖ అధికారులు జరిమానాలు విధిస్తారో..? లేదో..? కానీ ఒక పోలీసు తన తలకు హెల్మెట్ ధరించ కుండా రాత్రులందు నిర్లక్ష్యం తో ద్విచక్ర వాహనాన్ని నడిపిన దానికి తనకు తాను జరిమానాన్ని విధించుకొని ప్రాణాలు కోల్పోయిన దుస్థితిని కొనితెచ్చుకున్నారని ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ ఆంజనేయులు మృత దేహాన్ని రోడ్డు పై చూసిన ప్రజలు వాహనదారులు తమ బాధా తత్ప్ర హృదయాలతో ఆంజనేయులు మృతికి సంతాపాన్ని ప్రకటించారు.
కాగా శుక్రవారం రోజు రాత్రి ప్రమాదం లో చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్ ఆంజనేయులు
మృతదేహానికి నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శనివారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆంజనేయులు మృతదేహానికి నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఎస్పీ సంగ్రామ్ సింగ్, పోలీసు అధికారులు పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్ తదితరులు నివాళులు అర్పించారు.