విద్య హక్కు చట్టం ద్వారా విద్యను నేర్చుకొని ఉత్తమ పౌరులుగా విద్యార్థులు ఎదగాలి…
(యస్.పి. మల్లికార్జున సాగర్)
కొల్లాపూర్, నేటి సత్యం డిసెంబర్ 20.
రాజ్యాంగము ద్వారా కల్పించ బడిన విద్యా హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకొని విద్యను అభ్యసిస్తూ భావి భారత పౌరులుగా ఎదుగుతూ సమాజాభివృద్ధికి కృషి చేస్తూ జీవితం లో స్థిరపడాలని కొల్లాపూర్ మున్సిప్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి దమ్ము ఉప నిషద్వాని విద్యార్థిని విద్యార్థులకు ఉద్బోధించారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో ప్రిన్సిపాల్ కె. కవిత ఆధ్వర్యం లో శనివారం రోజు కొల్లాపూర్ మున్సిప్ కోర్టు, లోక్ అదాలత్ కోర్టు సిబ్బంది సౌజన్యం తో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు కు కొల్లాపూర్ కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి దమ్ము ఉప నిషధ్వాని , మరియు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్. శరణ్య లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇట్టి న్యాయ విజ్ఞాన సదస్సు లో కొల్లాపూర్ మున్సిప్ కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి దమ్ము ఉప నిషధ్వాని విద్యార్థినులతో మాట్లాడుతూ పోక్సో చట్టము గురించి అవగాహన కల్పించారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన విద్యా హక్కు చట్టం ద్వారా విద్య ను మంచిగా అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదిగి తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని జీవితం లో స్థిరపడాలని చదువుకున్న పాఠశాలకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టిన ఊరు కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విద్యార్థులకు ఉద్బోధించారు.
విద్యార్జన నే ధ్యేయం గా విద్యార్థినీ విద్యార్థులు ప్రశాంత వాతావరణం లో శ్రద్ధగా చదువుకుంటూ విద్యలో రాణించాలని, సెల్ ఫోన్లను వినియోగించరాదని, ఇతర ఇంటర్నెట్, టీవీ వీక్షణాలకు విద్యార్థిని విద్యార్థులు దూరం గా ఉండాలని అవసరము మేరకే విద్యా, విజ్ఞానాన్ని విశేషాలను తెలుసు కునేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, మోటారు వాహనములను డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే వాహనములు నడపాలని న్యాయమూర్తి విద్యార్థులకు తెలియజేశారు.
విద్యార్థినులు తాము నిర్దేశించుకున్న మార్గాన్ని మాత్రమే ఎంచుకొని గురువులు చెప్పిన అంశాలను వత్తిడికి గురికాకుండా శ్రద్ధతో వింటూ చదువును కొనసాగించాలని , సమాజం లో ఆడపిల్లలు స్వీయ రక్షణ కలిగి ఉండాలని ఆ దిశ గా కరాటే కింగ్ పూ వంటి ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలని విద్యార్థినీలకు న్యాయమూర్తి ఉప నిషద్వాని సూచించారు.
2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్. శరణ్య మాట్లాడుతూ మనము ఒకరికి మంచి చేయకున్నా పరవాలేదు కానీ ప్రకృతి మనుషులు సహజ సిద్ధము గా పొందుతున్న సౌకర్యాలను ఏర్పాటులను మనము వారికి దూరము చేయడం గాని వాటిని నాశనం చేయడం గాని చేయకూడదని విద్యార్థినీలకు సూచించారు.
నానాటికి పెరిగిపోతున్న శాస్త్ర విజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానాలకు మనము లోనై ప్రకృతి పరము గా మనకు లభిస్తున్న పర్యావరణాన్ని మన చేతులారా మనమే పాడుచేస్తున్నామని ప్రతి ఒక్కరు విధిగా పర్యావరణ రక్షణకు నడుం బిగించాలని, మొక్కలను నాటాలని వాటిని రక్షించి మన భావి తరాలకు సహజ సిద్ధమైన స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించే విధము గా పర్యావరణ రక్షణకు పాటుపడాలని ఆమె విద్యార్థినీలకు తెలియజేశారు.
సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని, సెల్ ఫోన్లలో వచ్చే ప్రమాదకరమైన లింకులను నొక్కి నష్టపోరాదని న్యాయమూర్తి శరణ్య విద్యార్థినిలకు సైబర్ నేరాలు మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహనను కల్పిస్తూ హెచ్చరించారు.
ఇట్టి సదస్సుకు హాజరైన న్యాయవాది భుజాల భాస్కర్ రెడ్డి విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థినులకు తన మిమిక్రీ నీ అందిస్తూ విద్యార్థినులకు ఆనందపరిచారు.
న్యాయవాది జె.సి. కుర్మయ్య విద్యార్థినులకు ఎఫ్.ఐ.ఆర్. గురించి వివరించారు.
కళాశాల ప్రిన్సిపాల్ కె . కవిత మాట్లాడుతూ న్యాయ దేవతలైన న్యాయమూర్తులు మా ముంగిటకు వచ్చి మా విద్యార్థినులకు నిత్యం ఎదురయ్యే సమస్యల యొక్క చట్టాలను వివరించడం మా పిల్లల అదృష్టని, ఇట్టి అవగాహన సదస్సు మాకు, మా విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు.
ఇట్టి సమావేశానికి న్యాయవాది ఎస్. రాజేష్, న్యాయశాఖ సిబ్బంది, లోక్ అదాలత్ సిబ్బంది, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్ హాజరయ్యారు.
అనంతరం కళాశాల ప్రాంగణం లో పర్యావరణ పరిరక్షణ కు న్యాయమూర్తులు దమ్ము ఉపనిషద్వని , శరణ్య లు మొక్కలు నాటారు. అలాగే న్యాయమూర్తులు కొల్లాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణం లో న్యాయ శాఖ సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు.