Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 7:31 am Editor : Admin

సంతలో కూరగాయలు కొన్న మంత్రి జూపల్లి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కొల్లాపూర్ సంత లో కూరగాయలు
కొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు…
(యస్.పి. మల్లికార్జున సాగర్)
కొల్లాపూర్,నేటి సత్యం, డిసెంబర్ 21.
అనునిత్యం ప్రభుత్వ కార్యకలాపాలతో అభిమానుల పలకరింపు సంప్రదింపులతో బిజీ బిజీగా ఉండే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారము ప్రశాంతం గా కొల్లాపూర్ లో జరిగే సంత లో కలియ తిరుగుతూ కూరగాయలు ఇతర వ్యాపారులను పలకరిస్తూ కూరగాయలు ఖరీదు చేశారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఈ సంతలో కూరగాయలతో పాటు ఇతర వస్తువులను వ్యాపారులు విక్రయిస్తుంటారు.
సంత లో కూరగాయలు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు వేలాదిగా సంతలో పాల్గొంటారు.
కాగా ఆదివారం ఉదయం కొల్లాపూర్ శాసనసభ్యులు, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉదయమే తన అభిమానులతో కలిసి సంతలో కలియ తిరుగుతూ వ్యాపారులను పలకరిస్తూ వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయి..? సంత ప్రస్తుతం జరుగుతున్న జాగాలో బాగున్నదా..?
ఇక ఎక్కడికైనా మార్చాలా..?అని కూరగాయలు ఇతర వస్తువులు అమ్ముకునే వారిని కలిసి మంత్రి వారి అభిప్రాయాలను సేకరించారు.
ప్రస్తుతం కొల్లాపూర్ పట్టణం లోని రాజా బంగ్లా ముందు నుండి తహసిల్దార్ కార్యాలయము ఆర్ ఐ డి హై స్కూల్ ఎస్బిఐ బ్యాంకు, రామాలయం వరకు ఉన్న రోడ్డుపైనే ఆదివారం రోజు సొంత జరుగుతుంటుంది.
సంతలో ఊరగాయలు ఇతర వస్తువులను అమ్ముకునే వ్యాపారులు ఇబ్బడి ముంబడిగా పెరుగు తుండడం తో రోడ్డు పైననే రెండు, రెండు వరుసలుగా దుకాణాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారులు కూరగాయల విక్రయ దారులు తమ కూరగాయలను వస్తువులను విక్రయిస్తుంటారు.
ఈ విధము గా రోడ్డుపై ఎదురెదురుగా దుకాణాలు ఉండటం వలన వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఒకే వరుసలో కూరగాయల దుకాణాలు ఇతర వస్తువులు విక్ర యించు కునే వారి దుకాణాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సంత ప్రస్తుతం జరుగుతున్న ప్రాంతం లోనే జరుగుతుంటే బాగుంటుందని వ్యాపారులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కాగా కొల్లాపూర్ సంతలో కూరగాయలు ఇతర వస్తువులను విక్రయించుకునే వ్యాపారుల నుండి 6x ఆరు రోడ్డుపై స్థలానికి తై బజారు కాంట్రాక్టర్ 30 రూపాయల నుండి వంద రూపాయల దాకా వసూలు చేస్తున్నారని కానీ సంతకు వచ్చే వినియోగదారులకు కొనుగోలుదారులకు వ్యాపారులకు వారి కనీస అవసరాలు తీర్చుకునేందుకు మరుగు , మూత్రశాలలను ఏర్పాటు చేయకపోవడం అలాగే తాగునీటి వసతులు కల్పించక పోవడం వలన తాము అనేక ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాము అని సంతలో వస్తువులు కూరగాయలు విక్రయించుకునే వారు మంత్రి జూపల్లి కృష్ణారావుకు తమ బాధలను వ్యక్తం చేశారు.