Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 12:30 pm Editor : Admin

మార్కిజం.. కమ్యూనిజం..అజయం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*మార్క్సిజం – కమ్యూనిజం* *అజేయం*
*ప్రజల మౌలిక సదుపాయాలు కావాలంటే పోరాటాలే మార్గం*
*యం సి పి ఐ (యు)రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గదాగోని రవి*
నేటి సత్యం శేరిలింగంపల్లి డిసెంబర్ 21

ఈరోజు మియాపూర్ డివిజన్ ఎం ఎ నగర్ లో యం సి పి ఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో మార్క్సిజం – స్థైతాంతిక ఆచరణ -ఓంకార్ గారి పాత్ర అనే అంశంపై పల్లె మురళి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథి యం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగాని రవి హాజరై మాట్లాడుతూ దేశంలోని పేదలు అత్యంత పేదలకు ఆధారమైన ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసే బిల్లు ఇది ఉపాధి హామీ రోజులను 120 రోజులకు పెంచినట్లు బి జె పి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది అని అన్నారు. వాస్తవానికి కొత్త బిల్లులో ఉన్న ఉపాధి కూలీల హక్కులను కాలరాస్తు కూలీలను తొలగించే నిబంధనలు ఉన్నాయని ఈ పరిస్థితులలో బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని యం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి కోరినారు మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించడమే లక్ష్యంగా చేసుకున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను వెనుకకు తీసుకోవాలన్నారు ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ప్రజలకు కూడా ఉపాధి లేకుండా చేస్తుందన్నారు కార్మిక,ప్రజావ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా యం సి పి ఐ (యు) కార్యకర్తలు పోరాడాలన్నారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి చట్టం నియంత్రణను పూర్తిగా తన ఆధీనంలో తీసుకొని రాష్ట్రాలకు ఆర్థిక భారాన్ని బదిలీ చేస్తుందన్నారు కొత్త చట్టం ప్రకారం కార్మిక వేతనాలపై ఖర్చులకేంద్రం మాత్రమే భరిస్తుందన్నారు మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాలని ఈ చట్టానికి సంవత్సరానికి కనీసం కోటి ఐదు లక్షలు కేటాయించాల్సి వస్తుందని అంచనా వేయగా రాష్ట్రాలు సమిష్టిగా దాదాపు 55 కోట్లు ఇవ్వాల్సి వస్తుందన్నారు ఈ బిల్లులోనీ ఒక ప్రమాదకరమైన నిబంధన వ్యవసాయ సీజన్లో ఉపాధి హామీని 60 రోజుల వరకు స్తంభింప చేయడానికి అనుమతిస్తుందన్నారు ప్రస్తుతం ఉపాధి చట్టంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పని నిలిపివేయడానికి ఎలాంటి నిబంధన లేదు అన్నారు కొత్త బిల్లు ఉపాధి డిమాండు అత్యధికంగా ఉన్నప్పుడు విత్తనాలు విత్తడం కోతతో సహా అత్యంత రద్దీగా ఉండే వ్యవసాయ కాలాలలో పనులను నిలిపివే సేందుకు రాష్ట్రాలు ముందస్తు నోటిఫికేషన్లు జారీ చేయడానికి వీలు కల్పిస్తుంది అన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పాటు వామపక్ష పార్టీలను కలుపుకొని పోరాటం చేయాలనీ వివిధ డివిజన్ నుండి హాజరైన పార్టీ కార్యకర్తలను పిలుపునిచ్చారు కార్యక్రమంలో యం సి పి ఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, సహాయ టీ అనిల్ కుమార్ కార్యవర్గ సభ్యులు కుంభం సుకన్య, తుకారాం నాయక్, తాండ్ర కళావతి, జి మల్లేష్, కిష్టయ్య,కోటేశ్వరరావు, తిరుపత్తయ్య, బాల్ రాజు, రాజు, రాఘవులు,పుష్ప, కర్ర దానయ్య,యల్ రాజు ఇస్లావత్ దశరథ్ నాయక్, శ్యామ్ సుందర్,కన్నా శ్రీనివాస్, భాగ్యమ్మ, బి.యాదగిరి,డివిజన్ నాయకులు, జి శివాని నర్సింహా, ఆకుల రమేష్ సుల్తాన బేగం, రజియా బేగం, ఇందిరా, గీత, చెన్నమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు