Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 12:38 pm Editor : Admin

కొలువు దీరనున్న కొత్త సర్పంచులు..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేడు కొలువు ధీరనున్న కొత్త సర్పంచులు.

ముస్తాబవుతున్న గ్రామ పంచాయితీ భవనాలు.

సమస్యలతో స్వాగతం పలుకుతున్న గ్రామాలు.

తెలకపల్లి.నేటి సత్యం డిసెంబర్ 21.

నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు.ఉప సర్పంచ్.వార్డుమెంబర్లు నేడు కొలువు ధీరనున్నారు.
వారిచేత మండల అధికారులు ప్రమాణస్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించనున్నారు.
మండలంలోని మొత్తం 28 గ్రామ పంచాయతీలకు గాను మూడు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగతా గ్రామాల సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.వీరిలో చాలా గ్రామాల ఉప సర్పంచ్ లను ఈనెల 11 న ఉప సర్పంచ్ లను కూడా ఎన్నుకున్నారు.మండలంలో రాంరెడ్డి పల్లి.సర్పంచ్ మినహాయిస్తే మిగతా 27 గ్రామాల సర్పంచులు కొత్తగా ఎన్నికైన వారు కావడం గమనార్హం.పెద్దూర్.తాళ్ళపల్లి.వట్టిపల్లి.దాసుపల్లి.గ్రామాల సర్పంచ్ లు తప్ప మిగిలిన దాదాపు 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారే ఉండం.యువత రాజకీయాల్లోకి రావడం గ్రామ అభివృద్ది కోసం ముందుకు రావడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.తమగ్రామాల అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన యువతి యువకులు.తమ ఆశయ సాధనలో నిర్ణాయక పాత్ర పోషించి గ్రామాల ప్రజలు మీపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్దే దేయంగ పని చెయ్యాలని మండల ప్రజలు కోరుతున్నారు.గ్రామాల్లో గత రెండు సంవత్సరాలుగా సర్పంచులు లేకపోవడంతో గ్రామాలన్నీ అభివృద్ధి లో కుంటుబడి ఉన్నాయి సమస్యలతో సతమౌతు మౌలిక సదుపాయాలు కూడా లేకుండా ఉన్నాయి . కొన్ని వీధుల వెంట వీధి దీపాలు వెలుగక అంధకారం ఉంటే.మరికొన్ని వీధులు మురికి కాల్వల నిర్మాణం పూర్తి కాకుండా ఉన్నాయి.మరికొన్ని వీధులు రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా కంపచెట్లతో నిండి ఉన్నాయి.వీటిఅన్నికి తోడు నిధుల లేమి.ఈసమస్యలన్నింటి అధిగమించి ముందుకు సాగడం యువతకు కత్తిమీద సామే ఏరకంగా నెట్టుకొస్తారన్నది ప్రశ్నార్థకమే .