Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 2:34 pm Editor : Admin

నాగర్ కర్నూల్ లో ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం
నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని జడ్పీ స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా మన ప్రియతమ నేత, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తొలి మ్యాచ్‌గా న్యూ స్టార్ నాగర్ కర్నూల్ vs కిల్లర్ సీసీ చెన్నై జట్ల మధ్య జరిగిన పోటికి ఎమ్మెల్యే గారు టాస్ వేసి మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభించారు.
క్రీడాకారులను ఉత్సాహపరిచిన

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, యువత క్రీడల వైపు మరింతగా ఆకర్షితులవ్వాలని, క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తరపున, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ పట్టణాన్ని క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రమణ రావు గారు ,సీనియర్ క్రికెటర్లు, మాజీ కౌన్సిలర్లు, క్రీడాభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.