ఉపాధి హామీ పథకం పేరు
జి రాంజీ అని మార్చడం దుర్మార్గం సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును జి రాంజీ ఉపాధి పథకం అని పేరు మార్చడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య తీవ్రంగా మండిపడ్డారు
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుండి గాంధీ పేరు మార్చి జి రామ్ జి అని మార్చడం వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఐ రంగారెడ్డి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడాలీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా నిర్వహించారు
ఈ సందర్భంగా పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును జిరామ్జీ అని పేరు మార్చి మత రాజకీయాలు చేస్తున్నదని దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు
మీకు రాముడు అంటే ఇష్టం ఉంటే మీ వ్యక్తిగత మీ పిల్లల కు లేదా బండ్లకు లేదా మీ ఇండ్లకు పేరు పెట్టుకోవచ్చు కానీ గత ప్రభుత్వాలు పెట్టిన మహాత్మా గాంధీ పేరు మార్చడం వెనకాల అంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు
నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ లౌకిక ఫెడరలిజ విలువలను తుంగలో తొక్కి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చట్టసభలలో కూడా ఇలాంటి పేర్లు వాడడం బాధాకరమని ఆయన విమర్శించారు
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు యధావిధిగా కొనసాగించాలని ఆ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు
నిరసన ధర్నాలో సిపిఐ రాష్ట్ర నాయకులు పుస్తకాల నర్సింగరావు పానుగంటి పర్వతాలు కే రామస్వామి టీ రామకృష్ణ సీనియర్ నాయకులు ఆర్ గోపాల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం ప్రభు లింగం పలనాటి యాదయ్య బాతరాజు నరసింహ కె నరసింహారెడ్డి మండల కార్యదర్శిలు కే చందు యాదవ్ ఎం సత్తిరెడ్డి ఎండి షకిల్ కే శ్రీనివాస్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు సుధాకర్. జిల్లా సమితి సభ్యులు సక్రు నాయక్ జిల్లెల కృష్ణ కమలమ్మ మహమూద్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గార క్రాంతి కుమార్.నాయకులు వెంకటరమణారెడ్డి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అన్యపు ప్రభు తదితరులు పాల్గొన్నారు