గ్రామాలలో గద్దెనెక్కిన కొత్త సర్పంచులు మరియు పాలకవర్గము.
*ప్రమాణ స్వీకారోత్సగ్రామాలలోవానికి హాజరైన “ఎమ్మెల్యే వీర్లపలి శంకర్”*
*కొత్త సర్పంచులకు ఎమ్మెల్యే “శంకరుడి” అభయం.
షాద్ నగర్,(నేటి సత్యం) :: డిసెంబర్,22 :: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నీయోజకవర్గం కొత్తగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులు ప్రమాణస్వీకారం ఘనముగా జరుపుకున్నారు. సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాల రాకతో కొత్త కళ వచ్చింది.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 153 గ్రామపంచాయతీలలో సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు ఏర్పాటు చేశారు. 153 గ్రామపంచాయతీలలో 83 మంది పురుషులు సర్పంచులు ఉండగా 70 మంది మహిళలు సర్పంచులుగా ఎంపికయ్యారు. సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవానికి నియోజకవర్గ “ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్”* హాజరైనారు. నియోజకవర్గ మండలాలు ఫరూక్ నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరి గూడ మండలాలలో అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలను సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇన్నాళ్లూ పాలకవర్గాలు లేక నిర్వహణ కరువైన కార్యాలయాలకు బూజు దులిపి, రంగులు వేసి తుది మెరుగులు దిద్దారు. తమ గ్రామాలకు కొత్త సర్పంచ్ రాబోతుండడంతో అటు ప్రజల్లోనూ, ఇటు నూతన ప్రజాప్రతినిధుల్లోనూ ఉత్సాహం నెలకొన్నది. ఈ ప్రమాణ స్వీకారంతో పల్లెల్లో మళ్లీ ప్రజాపాలన మొదలై నిలిచిపోయిన అభివృద్ధి పనులు ఊపందుకుంటాయని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.