(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పెంట్లవెల్లి సర్పంచ్ గా విజయం… తన
విజయం కాదు.. అది ప్రజల విజయం..
(యస్.పి.మల్లిఖార్జున సాగర్)
కొల్లాపూర్, నేటి సత్యం, డిసెంబర్ 22.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము పెంట్లవెల్లి (మండల కేంద్రం) గ్రామ పంచాయతీ సర్పంచి గా తాను గెలవడం తన విజయం తనది కాదని ఆ విజయము పెంట్లవెల్లి మండల ప్రజలది తనకు ప్రత్యక్షం గా సహకరించిన బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ది, నాయకులది, పరోక్షము గా సహకరించిన వివిధ పార్టీల నాయకులు ప్రజా సoఘాలు, కుల సంఘాల నాయకులది సభ్యులది అని పెంట్లవెల్లి గ్రామ సర్పంచి మార్పాకుల చిట్టెమ్మ అన్నారు.
పెంట్లవెల్లి గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ బిజెపి మద్దతుతో గెలిచిన మార్పాకుల చిట్టెమ్మ సోమవారం రోజు పెంట్లవెల్లి మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాల పాత భవన ఆవరణ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భం గా సర్పంచ్ చిట్టెమ్మ ఆనందోత్సవాలతో ఉద్వేగం గా మాట్లాడుతూ అటు పుట్టింటి ఆడపడుచు గా ఇటు మెట్టినింటి ఇల్లాలిగా తనను తమ కుటుంబాలలో ఒక ఆడపడుచు గా ఆదరించి పెంట్లవెల్లి గ్రామ సర్పంచ్ ప్రజలు గెలిపించారని ప్రజలందరికీ తాను రుణపడి ఉంటానని అన్నారు.
పెంట్లవెల్లి గ్రామ సర్పంచి గా గెలుపు తన గెలుపు కాదని తనను సర్పంచిగా గెలిపించిన పెంట్లవెల్లి మండల ప్రజలది అని ఆమె అన్నారు. తన గెలుపును పెంట్లవెల్లి గ్రామ ప్రజలకు తన గెలుపుకు సహకరించిన వారందరికీ అంకితం ఇస్తున్నట్లు సర్పంచ్ చిట్టెమ్మ ఆనందోస్తాల మధ్యన ప్రజలకు తెలియజేశారు.
పెంట్లవెల్లి గ్రామ సర్పంచిగా పదవీ బాధ్యతలను చేపడుతున్న తాను గ్రామం లోని ప్రతి ఒక్క రి అభివృద్ధి కి, అభ్యున్నతి కి తన సహాయ శక్తుల తనకు పదవి ఉన్నంత కాలం వర్గ వర్ణ రాజకీయ పార్టీలకు అతీతం గా సేవలు అందిస్తానని ఆమె పెంట్లవెల్లి గ్రామ ప్రజలకు హర్ష ద్వానాల మధ్యన ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇదే కార్యక్రమం లో పెంట్లవెల్లి గ్రామ వార్డు సభ్యులుగా గెలుపొందిన 14 మంది వార్డు సభ్యులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకార అనoతరం పెంట్లవెల్లి గ్రామ సచివాలయం లో సర్పంచ్ చిట్టెమ్మ పదవీ బాధ్యతలు చేపడుతూ సర్పంచి గా ఆఫీసు రిజిస్టర్లో తొలి సంతకము ను చేశారు.
ఈ సందర్భం గా గ్రామ సచివాలయం నకు విచ్చేసిన కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి కి , బి ఆర్ఎస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు కు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెంట్లవెల్లి గ్రామ సర్పంచి చిట్టెమ్మ ఆమె భర్త బి ఆర్ఎస్ పార్టీ నాయకులు సురేందర్ గౌడ్, పెంట్లవెల్లి మాజీ సర్పంచ్ హెచ్. రాజేష్ , బి ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు తదితరులు బాణాలు కాలుస్తూ స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు.
గ్రామ సచివాలయ సమావేశ మందిరము లో జరిగిన కార్యక్రమం లో పెంట్లవెల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన మార్పాకుల చిట్టెమ్మ కు కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అభిలాష్ రావు లు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా కప్పి సన్మానించారు.