(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేర్లింగంపల్లి డిసెంబర్ 22
ఏసీపీ వెంకటరమణ
చైన్ మెన్ మోహన్ లు
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం గురించి మరియు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న వైనం*
ఈరోజు ప్రజావాణిలో సర్కిల్ 20 లో ఏసిపి వెంకటరమణ గారు మరియు చైన్ మెన్ మోహన్ గారి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తున్నటువంటి దానిపైన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ గౌరవ ప్రశాంతి మేడం గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఏసీబీ వెంకటరమణ ఆయన ఇష్టం వచ్చిన అక్రమ భవనాలను సీజ్ చేసి అతని మర్యాదలు అతనికి అందగానే మళ్లీ అక్కడ తొంగి చూడడు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం చైన్ మెన్ మోహన్ ఇతని విధి నిర్వహణ ఏమిటంటే ఎక్కడైతే అనుమతులు లేకుండా అక్రమ భవనాలు ఉన్నాయో వాటిని ఉన్నత అధికారులకు తెలియపరచడం కానీ ఇతను గౌరవ ఎసిపి గారితో మాట్లాడి అక్రమ భవనాల పైన ఎలాంటి చర్య తీసుకోకుండా భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడని ప్రజలు అనుకుంటున్నారు కావున ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఏసీపీ వెంకటరమణ చైన్ మెన్ మోహన్ ల పైన చర్యలు తీసుకుంటూ అక్రమ కట్టడాల పైన కూడా చర్య తీసుకోగలరని నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే మీ మిద్దెల మల్లారెడ్డి కోరుతున్నాడు