(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రండి …. ముందుగా
ప్రభుత్వాల్ని ప్రైవేటేకరిద్దాం!
ఆనాడు
జాతీయకరణ
ఒక మంత్రంలా
ఈనాడు
ప్రైవేటీకరణ
ఒక కుతంత్రంలా
బస్సుల….ప్రైవేటీకరణ
బడుల….. ప్రవేటికరణ
నదుల…. ప్రవేటికరణ
ఆఖరికి
రైళ్ల …ప్రైవేటీకరణ
రహదారుల… ప్రవేటీకరణ
అంతటా
ప్రైవేటీకరణ…. ప్రైవేటీకరణ
ప్రైవేటీకరించటమే
సకల రోగాలకు నివారణయితే
ఓ…. పాలకులారా. !
రండి
సవా లక్ష రోగాలతో కునారీల్లుతున్న
మన
ప్రభుత్వాలను ప్రైవేటీకరిద్దాం
అంబానీకో…..అదానికో
అమ్మేసి
ఈ
దేశాన్ని
బాగు చేసుకుందాం
ఏమంటారు ?
విషయ సేకరణ ::
✍️
కా,, తోట జీవన్న
జిల్లా కార్యదర్శి, సిపిఐ (ml) రెడ్ స్టార్
పార్వతీపురం మన్యం జిల్లా….