(adsbygoogle = window.adsbygoogle || []).push({});
శంషాబాద్ బంద్ ను విజయవంతం
జేఏసీ నాయకులు
నేటి సత్యం శంషాబాద్, డిసెంబర్ 23 : శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రత్యేక జోనుగా ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు బంద్ నిర్వహించారు. మంగళవారం శంషాబాద్ మున్సిపల్ పట్టణంలో బంధువుల విజయవంతంగా ముగించారు.
ఈ సందర్భంగ జేఏసీ నాయకులు బుచ్చిరెడ్డి, కొనుమల శ్రీనివాస్, కే వై ప్రణయ్, జిల్లా ఆనంద్ లు మాట్లాడుతూ శంషాబాద్ లో బంద్ విజయవంతంగా జరిగిందని అన్నారు. తొమ్మిది రోజుల నుండి ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పారు, శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని మరియు రెండు డివిజన్లు పెంచాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని బలపేతం చేస్తామని హెచ్చరించారు.
ఈ బంద్ లో పాల్గొన్న
జేఏసి నాయకులకు మరియు యాదవ సంఘం నాయకులు, నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు,ముదిరాజ్ సంఘ నాయకులు ,రజక సంఘ నాయకులు , కుమ్మరి సంఘ నాయకులు, రెడ్డి సంఘ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, దర్పన్ ఫోటోగ్రాఫర్స్ సంఘ నాయకులు, మత్స్య కార్మికుల సంఘం, విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఎన్ ఎస్ యు ఐ, ఏబీవీపీ, డి ఆర్, ఎస్ వి ఎం ఎస్ ఎఫ్, యువజన సంఘం డివైఎఫ్ఐ, భవన నిర్మాణ సంఘ నాయకులు, విద్యుత్ కార్మిక సంఘ నాయకులు,మార్వాడి వ్యాపారస్తుల సంఘ నాయకులు,వంశీరాజుల సంఘ నాయకులు, వర్తక సంఘ నాయకులు, సిఐటియు సంఘ నాయకులు, ఆటో రిక్షా యూనియన్ నాయకులు, కార్ టాక్సీ స్టాండ్ నాయకులు,రాజకీయ పార్టీలు సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, బీఎస్పీ, ఎంఎస్పి, మరియు ఇతర సంఘాల నాయకులు, యువకులు అందరూ పాల్గొన్నారు. ఈ బందులో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ మరియు స్వచ్చందంగా తమ వ్యాపారాలను బంధు చేసి సంఘీభావం తెలిపిన వ్యాపారస్తులకు మరియు విద్యాసంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముంచర్ల మోహన్ రావు, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, జయసింహ, చిన్న గండు రాజేందర్, సిపిఎం నాయకులు నరగిరి, అనేపు ప్రభు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.