Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 3:10 pm Editor : Admin

పార్కుల అభివృద్ధి… ప్రభుత్వ ప్రధాన లక్ష్యం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పార్కుల అభివృద్ధే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
నేటి సత్యం శేరిలింగంపల్లి డిసెంబర్ 23

ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని
కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని ముఖ్య లక్ష్యంగా తీసుకొని ముందుకు సాగుతోందని
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ గారు తెలిపారు.

ఈ సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో సుమారు రూ.3 కోట్లతో నూతనంగా అభివృద్ధి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పార్కును
స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ప్రతి కాలనీలో పచ్చదనంతో నిండిన, సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన పార్కుల అభివృద్ధి ద్వారా
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో యలమంచి ఉదయ్ కిరణ్, సయ్యద్ గౌస్, అశోక్, రత్నాచారి, వాసు, శ్రీనివాస్ తదితర నాయకులు, కాలనీ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.