Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 7:43 am Editor : Admin

కేంద్రంలో మాయా ప్రభుత్వం నడుస్తుంది సిపిఐ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కేంద్రంలో మాయా ప్రభుత్వం నడుస్తోంది.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూణంనేని సాంబశివరావు

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు మిథ్య.. దేవుడిని దేవుడిలా.. చరిత్రను చరిత్రలాగా చూడాలి తప్పితే చరిత్రహీనులుగా మిగిలిపోకూడదు..మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని తీసివేయడం నేరం..మహాత్మ గాంధీ పేరు తీసేసి జీ రామ్ జీ పెట్టడం గాంధీని అవమానించడమే..కోట్లాది మంది కలలను కార్యరూపం దాల్చేదీ ఉపాధి హామీ పథకం..జీ రామ్ జీ పేరుతో పథకం స్వరూపం, నిధుల కేటాయింపులను మార్చారు..వ్యవసాయ కూలీలపై కడుపు మంటతో కేంద్రం కడుపు కొడుతుంది..దేశ భక్తులమని చెప్పుకుంటున్న వాళ్లు దేశ భక్తులా..దేశ ప్రజలను భక్షించే రాక్షసులా..?నరేంద్ర మోదీ దుష్ట పాలన సాగిస్తున్నారు..

రెండేళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎందుకు ఉన్నట్లు..?రెండేళ్లు కేసీఆర్ విలువైన సమాచారాన్ని వృధా చేశారు..ప్రభుత్వం తప్పులు చేయకుండా రెండేళ్లు కేసీఆర్ ఎందుకు సూచనలు ఇవ్వలేదు..

కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తున్నా..ఇంకా చేయాల్సింది ఉంది..

మహిళలకు 2500, తులం బంగారం ఇవ్వాల్సిందే..గ్లోబల్ సమ్మిట్, ఫుట్ బాల్ ఈవెంట్ పెట్టడం మంచిదైనప్పటికీ సామాన్య ప్రజలకు ఎక్కదు..

కమ్యూనిస్టులు ఏమున్నారు అన్న చోటల్లా కాంగ్రెస్ కు దెబ్బ పడింది..పార్టీ గుర్తులతో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇలాంటి తప్పులు చేయకూడదు..

పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ మంచి ఫలితాలు సాధించింది..సీపీఎం, సీపీఐకి మధ్య శత్రుత్వం లేదు..

సీపీఐ వందేళ్ల పండగను జనవరి 18న ఖమ్మంలో నిర్వహిస్తున్నాం..బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నాం..

రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి..

మాటలు, కొట్లాటలతో సమస్యలు పరిష్కారంకావడం లేదు..

గాదె ఇన్నయ్య అరెస్ట్ అన్యాయం..

ఎన్ఐఏ కు అడ్డు అదుపు లేకుండా పోయింది..