బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు
తెలకపల్లి నేటి సత్యం డిసెంబర్ 24 .తెలకపల్లి మండలం కాంగ్రెస్, బిజెపి నాయకులు బుధవారం మాజీ గ్రంథాలయ చైర్మన్ మాధవరం హనుమంతరావు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. మండల పరిధిలోని మదనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి, బొందయ్య లు, గోలగుండం గ్రామానికి చెందిన బిజెపి నాయకులు కే అంజన్ రావు బి ఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. వీరికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బి ఆర్ఎస్ పార్టీ కండువాలు వేసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రావు, ఉప సర్పంచ్ హరీష్, గ్రామ పార్టీ అధ్యక్షులు శేఖర్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ 1.మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ బిజెపి నాయకులు.