Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 9:59 am Editor : Admin

ఇజ్జత్ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఎప్పటికీ పూర్తి చేస్తారు??




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇజ్జత్ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి ఎప్పటికీ చేస్తారు

నేటి సత్యం ఇజ్జత్ నగర్ కాలనీ ఎస్ కొండలయ్య వార్త ప్రతినిధి

ఇజ్జత్ నగర్ సర్వేనెంబర్ 5/1 లో సుమారుగా 650 గజాల స్థలం బస్తి అవసరాల నిమిత్తం బస్తి డెవలప్మెంట్ నిమిత్తం ఉన్న భూమిలో బస్తీ కమ్యూనిటీ హాల్ నిర్మించి ప్రజలకు అందచేస్తామని కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసి సుమారుగా రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి కాలేదు.. ఇజ్జత్ నగర్ బస్తి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టినటువంటి కమ్యూనిటీ హాల్ త్వరగా పూర్తిచేసి ప్రజల అవసరాల నిమిత్తం అందజేయాలని ప్రజలు కోరుతున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు. నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు నాయకులు స్పందించి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నాం…

కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే బస్తి ప్రజలు విరాళాలు సేకరించి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రాథమిక సమాచారం.. ఈరోజు బస్తి నాయకులు కమిటీ హాల్లో స్థలాన్ని పరిశీలన చేసి నారు