100 సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ
ప్రజా ఉద్యమాల్లో అలుపెరుగని పోరాటం
అనార్థులకు అభాగ్యులకు అండగా నిలిచిన సిపిఐ పార్టీ
సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పార్వతాలు
నేటి సత్యం శంషాబాద్ డిసెంబర్ 26
భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు శంషాబాద్ మండల కేంద్రంలో మండల కార్యదర్శి నర్రగిరి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ శతాబ్ది ఉత్సవాలలో సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు
అనార్తులు అభాగ్యుల కోసం ఏర్పడిన పార్టీ సీపీఐ పార్టీ అన్నారు నాడు ఏర్పడిన తొలి నాళ్లలో రాజులకు వ్యతిరేకంగా రాజరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమంలో పాల్గొ న్న కమ్యూనిస్టులు జాతీయత భావాలతో అలుపెరుగని ఉద్యమాలు నిర్వహించిన గొప్ప చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ది అని అన్నారు
నాడు జరిగిన తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో వేలాది గ్రామాలను విముక్తి చేసి లక్ష ఎకరాల భూములు ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది అని తెలిపారు
భూమి బుక్తి విముక్తి పోరాటాలు ఎన్నో భారతదేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అన్నారు
పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేయించి భూ పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అన్యపు ప్రభు ఏఐటియుసి మండల నాయకులు రాజు నరేష్ నాయక్ రైతు మండల నాయకుడు బద్దం శివారెడ్డి యువజన సంఘం నాయకుడు ప్రవీణ్ గౌడ్ , బీసీ సంఘం నాయకుడు రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు