జాలర్ల వలలో చిక్కిన కొండచిలువ..
గన్నేరువరం (నేటి సత్యం) డిసెంబర్ 26 : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పోలిమేరలోని లోయర్ మానేరు డ్యాం లో చేపల వేటకు వెళ్లిన మండల కేంద్రానికి చెందిన మత్స్యకారుడు బోయిని ప్రశాంత్ వేసిన వలలో శుక్రవారం సుమారు 30 కిలోల అతిపెద్ద కొండచిలువ చిక్కింది. చేపలను సేకరిస్తుండగా వలలో కొండచిలువ చిక్కుకొని మృతి చెంది. ఉండడాన్ని జాలరి గమనించి బయటకు తెప్ప మీద తీసుకొని రాగ తోటి జాలర్లు కొండచిలువను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.