(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సింగోటం శ్రీ లక్ష్మీ నర సింహస్వామి దేవాలయ అభివృద్ధి కి నిధులు కేటాయించాలి…
(యస్.పి. మల్లికార్జున సాగర్)
కొల్లాపూర్, నేటి సత్యం, డిసెంబర్ 27..కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం లోని శ్రీ లక్ష్మీ నర సింహస్వామి దేవాలయ అభివృద్ధి కి..కొల్లాపూర్ శాసనసభ్యులు, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక , సాంస్కృతిక , పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక నిధులను మంజూరు చేసి దేవాలయ అభివృద్ధిని చేయాలని సింగోటం గ్రామ ఉపసర్పంచ్ తమటం సాయి కష్ణ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
సింగోటం శ్రీ లక్ష్మీ నర సింహస్వామి నీ దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ సింగోటం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశానికి విచ్చేయుచు న్న మంత్రి జూపల్లి కృష్ణారావు కి స్వాగతం స్వాగతం పలుకుతూ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వందల సంవత్సరాల చరిత్ర కలిగి లింగాకారం లో స్వయంభు గా వెలిసిన స్వామి వారి దేవస్థానం అని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నిధులు కేటాయించే విధం గా సమీక్ష సమావేశం లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటన చేయాలని సాయి కృష్ణ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
అదే విధం గా సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ముందర లక్ష్మీదేవి అమ్మ గుట్ట గుట్ట పైన వెలిసిన లక్ష్మీదేవమ్మ అమ్మవారు ఈ రెండు దేవాలయాల మధ్యలో శ్రీవారి సముద్రం శ్రీవారి సముద్రాన్ని అనుకొని ఉన్న సింగోటం పెద్ద చెరువు కట్ట ను , శ్రీవారి సముద్రం రిజర్వాయర్ ను పర్యటక కేంద్రం గా తీర్చిదిద్దాలని , శ్రీ లక్ష్మీ నర సింహస్వామి దేవస్థానాన్ని లక్ష్మీ దేవమ్మ దేవస్థానాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం గా అభివృద్ధి చేయాలని ఈ రెండు వాగ్దానాలు సమీక్ష సమావేశం లో తెలియజేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కు సింగోటం గ్రామ ఉపసర్పంచ్ బిజెపి పార్టీ నాయకులు తమటం సాయి కృష్ణ గౌడ్ విజ్ఞప్తి చేశారు.