Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 12:57 pm Editor : Admin

వీలీనమైన అన్ని జిహెచ్ఎంసి విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు జిహెచ్ఎంసి వేతనాలు అమలు చేయాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*జిహెచ్ఎంసి లో విలీనమైన అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులందరికీ జిహెచ్ఎంసి వేతనాలు అమలు చేయాలని వినతి పత్రం*

*తెలంగాణ మున్సిపల్ సంగం (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరిస్తూ శంషాబాద్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది.నూతనంగా జోనల్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు అనేపు ప్రభు, శంషాబాద్ మండల ఏఐటిసియు సీనియర్ నాయకులు నర్రాగిరి, ఏఐటియుసి సీనియర్ నాయకులు ఆర్ యాదగిరి, జోనల్ కమిషనర్ కే చంద్రకళ గారికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జోనల్ కమిషనర్ గారికి కార్మికుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరిస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన శంషాబాద్ జోన్ లో ఉన్నటువంటి ఆదిభట్ల, బడంగ్ పేట్, జల్ పల్లి, శంషాబాద్ సర్కిల్ లలో పనిచేస్తున్న కార్మికులందరికీ మున్సిపల్ వేతనాలు కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఇస్తున్నటువంటి వేతనాలు అమలు చేయాలని మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి కమీషనర్ గారినీ కోరడం జరిగింది. జోనల్ కమిషనర్ స్పందిస్తూ తప్పకుండా జిహెచ్ఎంసి మాదిరిగానే వేతనాలు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది.*