నేడు విద్యుత్ అంతరాయం
-విద్యుత్ ఏఈ శంతన్ తేజ
తెలకపల్లి నేటి సత్యం డిసెంబర్ 27.మండలంలో 33 కెవి లైన్ లో కొత్త ఏ బి స్విచ్ ఏర్పాటు చేయడం కోసం 28-12-2025 మధ్యాహ్నం 12:00 గంటలనుండి సాయంత్రం 4:00గంటల మధ్యలో మండల పరిధిలోని గోలగుండం, పెద్దూరు గ్రామాల సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శంతన్ తేజ శనివారం తెలిపారు.
వ్యవసాయ బోర్లకు త్రీఫేస్ సమ యంలో విద్యుత్ అంతరాయం ఏర్పడితే అది సాయంకాలం సింగిల్ ఫేస్ టైంలో కలపబడును. కాబట్టి రైతులు, విద్యుత్ వినియోగదారులు ఇట్టి విషయం గమనించి సహకరించగలరని వారు కోరారు.