(adsbygoogle = window.adsbygoogle || []).push({});
యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు.
గన్నేరువరం, (నేటి సత్యం) డిసెంబర్ 28 :కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కే డి సి సి బి సెంటర్ కు 340 బస్తాలు వచ్చాయి బస్తాలు వచ్చినవని రైతులకు తెలవడంతో ఉదయం నుంచి సెంటర్ వద్ద బారులు తీరారు.
- రైతులు మాట్లాడుతూ ఇంకా ఎన్నిరోజులు మాకు ఈ కష్టాలు వర్షాకాలం సీజన్లో ఇదే పరిస్థితి యాసంగి పంటకు కూడా ఇదే పరిస్థితి నెలకొంటే ఎలా పంటలు పండుతాయి ఇప్పటికైనా మాకు యూరియా కొరత లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ యూరియా పై దృష్టి పెట్టి వెంటనే రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని వేడుకుంటున్నామని తెలిపారు.