బి కేఎం యు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా
నేటి సత్యం డిసెంబర్ 29 కలెక్టర్ ఆఫీస్ న్యూస్ రంగారెడ్డి జిల్లా
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంబి కే ఎం యు జిల్లా సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు
ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జె అంజయ్య అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శిబుద్దుల జంగయ్య మాట్లాడుతూ మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారంటీ రోజు గార్ అండ్ మిషన్ గ్రామీణ్ గా నామకరణం చేసి అమలు పరచాలని చూస్తుంది కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు 1948లో ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే గాంధీజీని చంపితే నేడు పార్లమెంటులో గాంధీజీ పేరవున్న మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి గాంధీజీని మరోసారి హత్య చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఆయన దుయబట్టారు ప్రభుత్వాలు మారినంత మాత్రాన పథకాల పేర్లు మార్చడం అనేది ఇది సరైన పద్ధతి కాదు అని ఆయన మండి పడ్డారు రాముని పేరు లేనిదే పూట గడవదన్నట్టుగా వి బి జి రామ్ జి మార్చడం అంటే దాని వెనుక ఆంతర్యమేమిటో యావత్ ప్రజానీకానికి అవగతం అవుతుందని తెలియజేశారు దేవుని పేరా ఇంకా ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారని ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు వారిచ్చిన హామీలను వారు తెచ్చిన పథకాలను అమలుపరచడంలోనే కింద మీద పడె పరిస్థితి ఉందని కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలనేది సరైన పద్ధతి కాదు అని ఆయన మండిపడ్డారు అనిల్ అంబానీ బ్యాంకర్స్ కు 45 వేల కోట్ల రూపాయలు బాకీ పడితే 450 కోట్ల రూపాయలకు కుదించి నరేంద్ర మోడీ బ్యాంకర్స్ కు కట్టించారు వీడియోకాన్ కంపెనీ అధినేత 75 వేల కోట్ల రూపాయలు బ్యాంకర్స్ కు బాకీ పడితే 3500 కోట్ల రూపాయలు కుదించి బ్యాంకర్స్ కు కట్టించిన పరిస్థితి వేలాది కోట్ల రూపాయలు పన్నుల పేర
పేద ప్రజలపై వేసి వసూలు చేసి బ్యాంకార్స్ చెల్లించిన పరిస్థితి ఉంది బడా పెట్టుబడిదారులైన టాటా కంపెనీ అధినేత కు మొన్న బిహారి ఎన్నికల సందర్భంగా సెమి కాంటాక్ట్ ఇప్పిచ్చినందుకుగాను బిజెపి పార్టీకి 750 కోట్ల రూపాయలు పార్టీ పండుగ ఇచ్చారు ఇది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు బడ వ్యాపారస్తులకు కొమ్ముకాస్తున్న కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు సంబంధించిన పథకాలపై కోతలు విధించడం అనేది పేద ప్రజల నోటికాడి కూడును గుంజుకోవడమే అవుతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే విబిజి రాంజీ పథకాన్ని రద్దుచేసి మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని తిరిగి అమలు పరచాలని 1,85,000 కోట్లు పథకానికి కేటాయించి రెండు వందల రోజులు పనులు కల్పించి రోజు కూలి 800 ఇవ్వాలని కనీస సౌకర్యాలైన టెంటు మంచినీళ్లు వైద్య కిట్టు రవాణా సౌకర్యం పని ప్రదేశాల దగ్గర కల్పించాలని డిమాండ్ చేశారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెల్ల వెంకటేష్ శ్రీశైలం స్వరూప జిల్లా సహాయ కార్యదర్శి గాలయ్య రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం అనంత యశోద లక్ష్మమ్మ నరసమ్మ యాదమ్మ బాలమ్మ ఏఐటియుసి నాయకులు ఎండి షబ్బీర్ చిన్నయ్య బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు