గంజా సాగుచేస్తున్న నిందితుడు అరెస్టు 200 గంజాయి మొక్కలు ధ్వంసం
నేటి సత్యం డిసెంబర్ 31 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య నరసింహుల పేట మండల కేంద్రం లో ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో పకీరతండా గ్రామంలో నేతవాత్ రూప్ల తన వ్యవసాయ భూమిలో గంజాయిని అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్నాడని నమ్మదగిన సమాచారం రావడంతో ఎం సురేష్ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహుల పేట పోలీస్ స్టేషన్ మరియు సిబ్బంది వ్యవసాయ శాఖ అధికారి పంచుల సమక్షంలో వెళ్లి నేతవత్ రుప్ల కు చెందిన వ్యవసాయ భూమిలో పరిశీలించగా సుమారు 200 గంజాయి మొక్కలను నిందితుడైన నేతవత్ రూప్ల కులం లంబాడా వృత్తి వ్యవసాయం నర్సింహులపేట మండలం అనుమానితుడు అతని వ్యవసాయ భూమిలో గల రాలబోటిలో పెంచుతుండగా పంచుల సమక్షంలో 200 గంజాయి మొక్కలను అట్టి 200 గంజాయి మొక్కల విలువ రెండు లక్షల రూపాయల విలువ ఉంటుందని అన్నారు గంజాయి మొక్కలను పీకేసి కాల్చివేసి కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేయడం జరిగింది ఇటి కేసులో నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నర్సింహులపేట ఎస్సై ఎం సురేష్ మరియు పిఎస్ సిబ్బందిని సిఐ తొర్రూర్ గారు అభినందించడం జరిగింది. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా గంజాయి సాగు చేసిన గంజాయి అక్రమ కొనుగోలు అమ్మకం లేదా సరఫరా చేసినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును గంజాయి సాగు గురించి గానీ అక్రమ రవాణా గురించి సమాచారం పోలీసులకు అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు