(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి పూలే.
నేటి సత్యం సరూర్నగర్ జనవరి 3నేడు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా డాక్టర్స్ కాలనీ లో సిపిఐ పార్టీ సరూర్నగర్ మండల కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ. పూల మాల వేసి నివాళ్లు అర్పించిన…
అవమానాలను ధిక్కరించి అణగారిన ఆడపిల్లలకు అక్షరాలు నేర్పించిన
భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక ఉద్యమకారిణి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త, రచయిత్రి, స్త్రీల విద్య అభివృద్ధికి కృషిచేసిన దారిదీపం, విద్య క్రాంతి రేఖ
ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థల పై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రీ బాయి. స్త్రీ జాతి ఆణిముత్యం కరుడుగట్టిన బ్రాహ్మణిజం కబంధహస్తాల నుంచి స్త్రీ జాతి విముక్తి కల్పించిన మహా సంకల్పి మాతృమూర్తి. స్త్రీ బయటకు వెళ్లాలంటే పరదా వేసుకోవాలని శాసించిన సమాజాన్ని చీల్చి సమస్త భారత మహిళా లోకానికి స్వేచ్ఛా, స్వాతంత్రాలు ప్రసాదించిన మానవి.
తను చదువుకుని సాటి స్త్రీలకు విద్య చెప్పడానికి రాళ్లు, రప్పలు, పేడ మీద పడుతున్న వాటిని పువ్వుల్లా భావించి లక్ష్యసాధనలో వెనకడుగు వేయలేదు. పురుషులే కాదు సాటి స్త్రీల సూటిపోటి మాటలతో ఆశీర్వవచనాలుగా స్వీకరిస్తూ ముందుకు సాగిన మహిమాన్విత స్త్రీ మూర్తి ,వేల సంవత్సరాలుగా భారత స్త్రీ కి విద్య అందుబాటులో లేదు ఆ విద్య విజ్ఞాన జ్యోతిని స్త్రీ జాతికి ప్రసాదించిన సాహసనారి.మనువాదుల చెర నుండి విడిపించి భారత స్త్రీ జాతికి విముక్తి అందించి,మానవజాతికి ఒక రోల్ మోడల్ గా ఒక స్త్రీగా, వ్యక్తిగా, భార్యగా తల్లిగా, సమాజ హితకారిణీ గా ఒక వ్యక్తి ఎలా ఉండాలో నిరూపించిన ఆదర్శనారి,భార్యాభర్తల అనుబంధానికి ఆమె ప్రతిక, జీవితంలో ఆమె నిర్వహించిన ప్రతి పాత్ర మహిళా లోకానికి ఆదర్శం మనందరికీ అనుసరణీయం అర్ధాంగికి నిజమైన అర్థం చెప్పిన ఆదర్శనారి భారతీయ మహిళా శిరోమణి అని భారత స్త్రీ జాతికి తొలిగా అక్షరాభ్యాసం చేసింది. బతుకు పోరులో విద్య అవసరాన్ని విడమర్చి చెప్పింది మహిళ విద్యావంతురాలైతే జాతీయ మహోన్నతికి ఎదుగుతుందని లోకానికి చాటిచెప్పిన భారత తొలి ఉపాధ్యాయిని సావిత్రమా.కుల వ్యతిరేక ఉద్యమంలోనూ, స్త్రీ హక్కుల పోరాటం లోను సావిత్రిబాయి నిర్వహించిన పాత్ర సాటిలేనిది పితృస్వామ్యానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో జరిగిన సామాజిక ఉద్యమాల అన్నిటిలోనూ నాయకత్వ స్థానాల్లో కనబడే మహిళ ,స్త్రీలు అణగారిన కులాలు చేసే ప్రతిఘటన పోరాటానికి ఆమె గొప్ప ప్రోత్సాహాన్ని అందించింది భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాల స్థాపించి మహిళా సంఘాలు కూడా నెలకొల్పింది అని,భర్త చితిని తానే నిప్పంటించి దహన సంస్కారాలు నిర్వహించిన సావిత్రిబాయి తెగువ చూసి దేశం దిగ్భ్రాంతి చెందింది ఆమె భర్త అడుగుజాడల్లో నడిచి సాంప్రదాయ పతివ్రత కాదని స్వతంత్ర వ్యక్తిత్వం గల అరుదైన స్త్రీ అని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు.తన భర్తతో పాటుగా హుందాగా తలెత్తుకుని నడిచిన సావిత్రిబాయి జీవితం, భారత స్త్రీ విముక్తి కి నిజమైన ఆదర్శంగా నిలిచి ఉంటుంది 19వ శతాబ్దంలో ఆమె సాధించిన కృషి ముందు మనం తలవంచక తప్పలేదు. సావిత్రిబాయి పూలే ఏ విప్లవాత్మకమైన లక్ష్యాన్ని సాధించాలని జీవితాంతము తపించిందో ఆ లక్ష్యం ఈ నాటికి సామాజిక ప్రజాస్వామిక వాదుల ముందు సవాలుగానే నిలిచింది అని ,సామాజిక సాంస్కృతిక పరివర్తన పోరాటాలకు స్ఫూర్తినిస్తూ మన ఆశయాలను వాస్తవ చరణాలుగా మార్చుకునే శక్తిని అందిస్తూ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలవడమే సావిత్రిబాయికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ గోపాల్. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్ సిపిఐ రంగారెడ్డి జిల్లా సమితి సభ్యులు రామావత్ సక్రు నాయక్ ఎండి మహబూబ్. సిపిఐ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్. వర్రే ఇస్తారి. రాయ బండి పాండురంగ చారి జాహీద్. తదితరులు పాల్గొన్నారు.