Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 10:03 am Editor : Admin

హామీలను అడుగుతే అరెస్టుల.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆటో డ్రైవర్ల హామీల అమలుకే అడిగితే ముందస్తు అరెస్టులా?

చలో అసెంబ్లీ పిలుపుతో ఏఐటియుసి నేత వనంపల్లి జైపాల్ రెడ్డి అరెస్ట్‌పై తీవ్ర విమర్శలు*

నేటి సత్యం రంగారెడ్డి, జనవరి 3 మైలార్‌దేవ్‌పల్లి:తెలంగాణ ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర కమిటీ ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరినందుకు ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని రంగారెడ్డి జిల్లా ఏఐటియుసి కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.ఉదయం 5 గంటలకే వనంపల్లి జైపాల్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.నిరసనకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో నిర్బంధాలు విధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

*ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ*— కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 సహాయం ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు ఒక్క ఆటో డ్రైవర్‌కైనా అమలు కాలేదని పేర్కొన్నారు.అలాగే రాష్ట్రంలోని ఆటో, రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఆటోల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న డ్రైవర్లకు తగిన పరిహారం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు.నాయకుడి ముందస్తు అరెస్ట్ సమాచారం తెలుసుకున్న వెంటనే ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. చివరకు పోలీసులు మధ్యాహ్నం 2 గంటలకు సొంత పూచీకత్తుపై వనంపల్లి జైపాల్ రెడ్డిని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అంజి, మహేష్ యాదవ్, నిరంజన్, మాధవులు, రాజు, గోపాల్, రాజేష్, వెంకటేష్, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.