వెనిజులాపై అమెరికా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
వెనిజులా దేశంపై అమెరికా సామ్రాజ్యవాదం చేపడుతున్న రాజకీయ, ఆర్థిక, సైనిక దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవి, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి. ఒక స్వతంత్ర సార్వభౌమ దేశం తన వనరులు, తన రాజకీయ విధానాలను స్వయంగా నిర్ణయించుకునే హక్కును కాలరాస్తూ అమెరికా సాగిస్తున్న ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.