(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వెనిజులా అధ్యక్షుడు మధురో, ఆయన భార్య అరెస్టులకు ఖండన
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
దక్షిణమెరికా వెనిజులా దేశ సార్వభౌమాధికార నియమాలను ఘోరంగా ఉల్లాంఘిస్తూ వైమానిక దురాక్రమణ దాడులకు పాల్పడి దేశ అధ్యక్షుడు నికోలాస్ మధురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అత్యంత దుర్మార్గ, చట్టవిరుద్ధ పద్ధతుల్లో అరెస్టు చేయదాన్ని
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మూడో ప్రపంచ దేశమైన వెనుజులపై అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను మా పార్టీ తీవ్రంగా ఖండించారు. ఆ దేశ ప్రజలచే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన దేశాధ్యక్షుడి పై, ఆయన కుటుంబంపై ఇలాంటి బెదిరింపులు, అరెస్టులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు, మానవ హక్కులకు, ఐక్య రాజ్య సమితి నియమ, నిబంధనలకు దేశాల సార్వభౌమత్వాలను ఉల్లంగించడమని మా పార్టీ భావిస్తున్నదని పేర్కొన్నారు.
వెనిజులా ప్రజల తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో అమెరికా సామ్రాజ్యవాదం రాజకీయ, న్యాయ, సైనిక మార్గాల్లో సాగిస్తున్న దాడులే ఇవి. చమురు వంటి సహజ వనరులపై ఆధిపత్యం కోసం ఒక దేశ నాయకత్వాన్ని నేరస్తులుగా ముద్రవేసి అరెస్టు చేయాలనుకోవడం ఆధునిక వలసవాద దురహంకారానికి ప్రతిరూపమని తెలిపారు.
ఇవి అధ్యక్షుడు మధురోపై జరిగిన వ్యక్తిగత దాడులు మాత్రమే కాదనీ, ఇవి మొత్తం వెనిజులా ప్రజలపై, వారి స్వాతంత్రంపై హక్కులపై జరిగిన దాడులని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు వెనిజులా ప్రజల పోరాట సంకల్పాన్ని బలహీనపరచలేవనీ,
అంతర్జాతీయ సమాజం ఈ దుర్మార్గమైన అరెస్టు లను వెంటనే ఖండించాలన్నారు. వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని తక్షణమే ఆపాలనీ, ఆ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, భారత ప్రభుత్వం కూడా సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటించాలని డిమాండ్ చేశారు.
సామ్రాజ్యవాద దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలిచే వెనిజులా ప్రజల పోరాటానికి మా పార్టీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తుందన్నారు.
ప్రజల ఐక్యతతోనే ఈ దుర్మార్గ కుట్రలు ఓడిపోతాయని,
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.