నేటి సత్యం.హైదరాబాదులో సొంతిల్లు కల నెరవేర్చి ఛాన్స్ వచ్చింది!
హైదరాబాదులో సొంత ఇల్లు కల అనేది చాలామందికి పెద్ద కల ఒక డ్రీమ్.. ముఖ్యంగా గచ్చిబౌలి లాంటి ఐటీ ప్రాంతాల్లో ఇల్లు కొనడం అంటే భారీ ఖర్చుతో కూడుకున్న విషయం.. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డ్.( టి జి హెచ్ బి) గచ్చిబౌలిలో ఫ్లాట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించరు. అనేది గృహం లేని వారికి ఒక మంచి అవకాశం గా చెప్పుకోవచ్చు. ఈ ప్లాట్లు ప్రభుత్వ పరివేక్షణలో లాటరీ విధానంలో పూర్తిగా పాదదర్శకంగా కేటాయించనున్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని అర్హత నిబంధనలు ఉన్నాయి దరఖాస్తుదారుని కుటుంబ వార్షిక ఆదాయము ఆరు లక్షల లోపు ఉండాలి అలాగే దరఖాస్తుదారు లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లపై హైదరాబాద్ లేదా గచ్చిబౌలిలో ఇల్లు ప్లాట్లు లేదా స్థలం ఉండకూడదు ఈ నిబంధనాల నేపథ్యం ఉద్దేశం నిజంగా అవసరం ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ ప్లాట్లు అందేలా చూడడమే అదేవిధంగా ప్రాజెక్టు ఉన్న పట్టణంలో నివసిస్తున్న వారికి దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తున్నారు.