(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సంస్కృతిని చాటి చెప్పేవి ముత్యాల ముగ్గులు
సాంప్రదాయబద్ధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం నాగర్ కర్నూల్ డి.ఎస్.పి బుర్రి శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగాముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఎం ఆర్ కె న్యూస్ ఛానల్ వారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ లోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం ఆవరణంలో సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి.ఎస్.పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పండుగలు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పండుగలను సంప్రదాయాలను జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు.ఎం ఆర్ కె న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో పైన మహిళల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామకృష్ణను డి. ఎస్. పి అభినందించారు.అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి..సీనియర్ జర్నలిస్టులు,జెమిని సురేష్,చంద్రశేఖర రావు,ప్రదీప్,సాదిక్,హకీమ్ కిషోర్,బిగ్ టీవీ రాంప్రకాష్,దిశా బాలు,రామకృష్ణను అభినందించారు.
అనంతరం ముగ్గుల పోటీలోమొదటి బహుమతి కే.సంధ్య 5,000,ద్వితీయ బహుమతి అరుణ శ్రీ 3,000 రూపాయలు అందించారు.మూడో బహుమతి విజయ లక్ష్మి అనుపా 2,000 సాధి౦చారు.ఈ కార్యక్రమంలో సి.ఐ అశోక్ రెడ్డి,సీనియర్ జర్నలిస్టులు తో పాటు స్పాన్సర్స్ కిరాణా వర్తక సంఘం , క్లాస్మేట్ క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.
న్యాయానిర్ణేతలుగా మాజీ సర్పంచ్ దొడ్ల ఇందుమతి,రిటైర్డ్ ఉపాధ్యాయురాలు యశోద రెడ్డి,బాదం సునీత నరేందర్ లు వ్యవహరించారు..