Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 1:53 pm Editor : Admin

ప్రభుత్వ స్కూలుకు..ప్రవేటు పి ఈ టి ఏర్పాటు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కొండూరు ప్రభుత్వ పాఠశాల లలో సర్పంచ్ కేతూరి ధర్మతేజ ఆధ్వర్యంలో ప్రైవేటు పిఈటి ఏర్పాటు..

ప్రమాణ స్వీకారం అనంతరం విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాల్ సహకారంతో ముందడుగు…

గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం ప్రమాణ స్వీకారం రోజు విద్యార్థులకు సీట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు వెళ్లిన సందర్భంలో విద్యార్థులందరూ పాఠశాలలో క్రీడా కార్యక్రమాలను కొనసాగించేందుకు తమకు వ్యాయమ ఉపాధ్యాయుడు(PET )ని ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో..

అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం నేడు పెంట్లవెల్లి మండల పరిధిలోని *కొండూరు* గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు PET ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ *కేతూరి ధర్మతేజ* తెలిపారు..

ఈ సందర్భంగా నేడు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పరిచయ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామస్తులు PET రవి ని సన్మానించారు.ఈ సందర్భంగ సర్పంచ్ కేతూరి ధర్మతేజ మరియు మండల సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ *నల్లబోతుల గోపాల్* లు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి మంత్రి *జూపల్లి కృష్ణారావు* గారి సహకారంతో గతంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని రాబోయే రోజుల్లో విద్యార్థుల అభ్యున్నతికి ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటామని చదువుతోపాటు శారీరక దృఢత్వం విద్యార్థులకు అవసరమని అందులో భాగంగానే వ్యాయమ ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వడ్డెమాన్ రాముడు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ గౌడ్,పొట్లపల్లి నాగరాజు,గ్రామ నాయకులు వార్డు మెంబర్లు నల్లబోతుల కురుమయ్య,దొబ్బలి వెంకటయ్య,విజయ్ గౌడ్, కావలి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.